టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’(Yuvagalam) పాదయాత్ర 2 వేల కిలో మీటర్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది.153 వ రోజు పాదయాత్ర నెల్లూరు జిల్లా (Nellore District) కావలి నియోజకవర్గంలోని కొత్తపల్లి వద్ద చేరుకోగానే ఈ మైలురాయిని చేరుకుంది.లోకేష్ (Lokesh) యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తలియజేశారు. ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు. యువగళాన్ని వినిపిస్తూ, ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ సాగుతున్న పాదయాత్రను చూసి గర్వపడుతున్నానని ట్విటర్ వేదికగా చంద్రబాబు(Chandrababu) తెలిపారు.
ప్రజాగళంగా, ప్రజాబలంగా మొదలైన యువనేత నారా లోకేష్ పాదయాత్ర నేడు 2000 కి. మీ మైలు రాయిని చేరుకున్న సందర్భంగా ట్విట్టర్ వేదికగా #2000kmsOfYuvaGalam అనే హాష్ టాగ్‌తో వేల సంఖ్యలో ట్వీట్స్ వేస్తూ యువనేత పాదయాత్రకి నెటిజన్లు సంఘీభావం తెలుపుతున్నారు. పాదయాత్ర ఈరోజు కావలి (Kavali) అసెంబ్లీ నియోజకవర్గం కొత్తపల్లి వద్ద చారిత్రాత్మక 2వేల కి.మీ. మజిలీకి చేరుకోవడం జీవితంలో మరపురాని ఘట్టం. ఇందుకు గుర్తుగా కొత్తపల్లిలో ఆక్వారైతులకు చేయూతనిచ్చే ఫిషరీస్ డెవలప్ మెంట్ బోర్డు ఏర్పాటుకు హామీ ఇస్తూ, శిలాఫలకాన్ని ఆవిష్కరించాను”ట్విటర్లో ఇండియా వైడ్‌గా మూడవ స్థానంలో #2000kmsOfYuvaGalam అనే హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.
ప్రజలకు చేరువయ్యేందుకు ఇది దోహదపడుతుందని, ఇంకా చాలా మైళ్లు ప్రయాణించాల్సి ఉందని ట్విటర్ లో రాశారు. ట్వీట్ తోపాటు పాదయాత్ర సమయంలో యువతతో లోకేష్ దిగిన ఫొటోను చంద్రబాబు పోస్ట్ చేశారు.అంతేకాదు యువనేత లోకేశ్ దృఢ సంకల్పానికి నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు. ఇకపోతే చిత్తూరు జిల్లా కుప్పం (Kuppam) లోని వరదరాజస్వామి గుడి వద్ద జనవరి 27న ప్రారంభమైన ఈ పాదయాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. లోకేష్ పాదయాత్ర 100 రోజులు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని తల్లి భువనేశ్వరి(Bhuvaneshwari)తోపాటు కుటుంబ సభ్యులు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి లోకేశ్‌ను కలిసి విషెస్ తెలిపారు
కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాలచెంత తొలి అడుగుతో ప్రారంభమైన యువగళం జనగళమై, మహా ప్రభంజనమై, అరాచక పాలకుల గుండెల్లో సింహస్వప్నమై ప్రజలను చైతన్యపరుస్తూ లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. ప్రజల కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ సాగుతున్న నా… pic.twitter.com/yjmyDJ16JE