»Big Update For Itr Filers This Information Given By Income Tax Department Is For You
ITR Filing: ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి
ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు మొత్తం బడ్జెట్ అంచనాలో 26.05 శాతానికి చేరుకున్నట్లు తెలిపింది. అలాగే ఈ సంవత్సరం నికర లైవ్ టాక్స్ లు 17.63 శాతం పెరిగిందని తెలిపింది.
Big update for ITR filers.. This information given by income tax department is for you..
ఈ సంవత్సరం మన దేశంలో ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 15.87 శాతం పెరిగి రూ.4.75 లక్షల కోట్లకు చేరుకుందని తెలిపింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం స్థూల వసూళ్లు రూ.5.17 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో స్థూల వసూళ్లతో పోలిస్తే ఇది 14.65 శాతం పెరిగింది. ఈ గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే దేశ ఆర్థిక కార్యకలాపాలు ఈ సంవత్సరం విపరీతంగా పెరిగాయని తెలుస్తుంది.
అలాగే ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన నివేదికలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు మొత్తం బడ్జెట్ అంచనాలో 26.05 శాతానికి చేరుకున్నట్లు తెలిపింది. ఇందులో ఆదాయపు పన్ను, కంపెనీ పన్ను ఉన్నాయి. పన్ను రీఫండ్ తర్వాత ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.4.75 లక్షల కోట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే కాలంలో వచ్చిన నికర పన్ను వసూళ్లతో పోలిస్తే ఇది 15.87 శాతం ఎక్కువ. మంత్రిత్వ శాఖ ప్రకారం గత ఏడాది కన్నా ఈ సంవత్సరం 2055 శాతం రిఫండ్ లు పెరిగాయని తెలిపింది. అలాగే డైరెక్ట్ టాక్స్ వసూళ్లు శాతం పెరిగి రూ. 5.17 లక్షల కోట్లకు రీచ్ అయ్యిందని కేంద్రం తెలిపింది.
2023-2024 ఆర్ధిక ఏడాది బడ్జెట్లో నికర లైవ్ టాక్స్ వసూళ్లు కూడా రూ.18.23 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేసింది. ఇది 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.16.61 కోట్ల కంటే 9.75 శాతం ఎక్కువ. 2022-23 ఆర్థిక ఏడాదిలో లైవ్ టాక్స్ వసూళ్ల గణాంకాలు నికర వసూళ్లు రూ. 16.61 లక్షల కోట్లు. గత ఆర్థిక సంవత్సరం రూ.14.12 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 17.63 శాతం పెరిగిందని కేంద్రం తెలిపింది.