Pawan Kalyan: వైసీపీపై విరుచుకుపడ్డ జనసేనాని..దద్దరిల్లిన ఏలూరు బహిరంగ సభ
ఏపీ సీఎం జగన్పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు. రాష్ట్రానికి సీఎంగా జగన్ అవసరం లేదని విమర్శించాడు. వారాహి విజయ యాత్రలో భాగంగా ఏలూరులో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
ఏలూరులో జనసేన వారాహి విజయ యాత్ర(Varahi vijaya Yatra) రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఏపీ సీఎం జగన్(Cm Jagan)పై జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) విరుచుకుపడ్డాడు. సీఎం పీఠానికి విలువ ఇస్తానని, జగన్ కు మాత్రం ఇవ్వనని అన్నారు. వైసీపీ(YCP) నాయకులు తన కుటుంబం గురించి, బిడ్డల గురించి చెడుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై సీఎం జగన్ ని, వైసీపీ నాయకులను ఏకవచనంతోనే పిలుస్తానని ధ్వజమెత్తారు.
సీఎం పదవికి జగన్(Jagan) అనర్హుడని, వైసీపీ(YCP) సర్కార్ రాష్ట్రానికి సరైంది కాదని ఆరోపణ చేశారు. ఏలూరులో వరదలు వస్తే ఎందుకు మునిగిపోతోందని, రక్షణ గోడలు ఏమైనట్లని ప్రశ్నించారు. సీఎం జగన్(CM Jagan)కు బానిసలం కాదని, ఆయన కూడా మనలో ఒకడని తెలిపారు. ప్రజలు కట్టే పన్నులకు, ఖజానాకు సీఎం జవాబుదారీ అని అన్నారు.
ఏపీ(Ap) రాష్ట్ర ఖజానా రూ.10 లక్షల కోట్లు ఉంటే వాటిని ఎలా ఖర్చు పెట్టాలో సీఎం మనకు తెలియజేయాలన్నారు. జగన్(jagan) రూ.లక్షా 18 వేల కోట్ల అప్పు తీసుకొని ఎందుకు ప్రజలకు లెక్క చెప్పలేదని ప్రశ్నలు గుప్పించారు. అలాగే రూ.22 వేల కోట్ల లిక్కర్ బాండ్లపై అప్పు తీసుకొని ఆ డబ్బుని ఏం చేసినట్లని, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(Road Developement Corporation) డబ్బులు ఎలా ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశాడు.