నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (Tana) 23వ మహాసభల్లో సభల్లో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. తరని పరుచూరి, సతీష్ వేమన వర్గాలు చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. రెండుగా చీలిపోయిన టీడీపీ ఎన్నారై సభ్యులు (TDP NRI numbers) పిడి గుద్దులుతో దాడి చేశారు ఫిలడెల్ఫియా(Philadelphia)లోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ వేదికగా జూలై 7, 8, 9 తేదీల్లో జరిగిన ఈ సభల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ సభలో పలువురు పరస్పరం కొట్టుకోవడం దుమారం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. సోషల్ మీడియా(Social media)లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. టీడీపీ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలో ఈ గొడవ జరిగింది.
ఈ గొడవకు సంబంధించిన వీడియోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress party) తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. జై ఎన్టీఆర్ నినాదం తీసుకురావడంతోనే లోకేష్ అభిమానులు గొడవకు దిగారని, ఈ క్రమంలో తరని పరుచూరి, సతీష్ వేమన వర్గాలు పరస్పరం కొట్టుకున్నాయని పోస్టు చేసింది. పిడిగుద్దులు గుద్దుకుంటూ రచ్చ చేశారని రాసుకొచ్చింది. ఇక, ఈ ఘటనపై టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) స్పందించారు. ఈ క్రమంలో టీడీపీ లీడర్లపై ఫుల్ సీరియస్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన బండ్ల గణేష్.. ‘తానా పరువు తీస్తున్నారు కదా దాని నిర్మించడానికి ఎంతోమంది మన జాతి పెద్దలు పట్టా కష్టాన్ని గంగలో కలిపారు నిచుల్లారా.. సిగ్గు లేదా మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ సమావేశాలకు తెలుగు రాష్ట్రల నుండి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu), సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ, సినీనటులు, ఎమ్మెల్యే బాలకృష్ణ, తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే సీతక్క పలువురు హాజరయ్యారు.