Bandla Ganesh: ఇదేం షాక్..త్రివిక్రమ్ పై బండ్ల గణేష్ పోస్ట్ వైరల్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో బండ్ల గణేష్(Bandla Ganesh) ఇచ్చే స్పీచ్, సోషల్ మీడియా ఎలివేషన్ మామూలుగా ఉండదు. అలాగే.. తనకు నచ్చని వ్యక్తుల గురించి కూడా అలాగే కామెంట్స్ చేస్తుంటాడు బండ్లన్న. ముఖ్యంగా త్రివిక్రమ్, బండ్లన్నకు పడదనే టాక్ ఉంది. కానీ తాజాగా త్రివిక్రమ్ పై బండ్లన్న చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
బండ్ల గణేష్(Bandla Ganesh) అంటేనే టాలీవుడ్ ఫైర్ బ్రాండ్. బండ్లన్న ఏం మాట్లాడినా సెన్సేషనే. గత కొన్నాళ్లుగా త్రివిక్రమ్ పై సందర్భం వచ్చినప్పుడల్లా ఫైర్ అవుతునే ఉన్నాడు బండ్ల గణేష్. ఆ మధ్య భీమ్లా నాయక్ ఈవెంట్‌కు తనను రానివ్వకుండా చేశాడని.. త్రివిక్రమ్‌ను తిట్టినా ఆడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయినా ఆ వాయిస్ తనది కాదని కవర్ చేశాడు బండ్లన్న. ఆ తర్వాత మరోసారి ఇండైరెక్ట్‌గా త్రివిక్రమ్ పై హాట్ కామెంట్స్ చేశారు. గురూజీని కలిసి కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తే ప్రొడ్యూసర్ అయ్యిపోవచ్చని చెప్పాడు బండ్లన్న. అలాగే ‘భార్యాభర్తల్ని, తండ్రి కొడుకుల్ని, గురుశిష్యుల్ని, ఎవర్నైనా వేరు చేస్తాడు అనుకుంటే.. అది మన గురూజీ స్పెషాలిటీ..’ అంటూ రాసుకొచ్చాడు.
అసలు త్రివిక్రమ్, బండ్ల మధ్య ఉన్న వైరం ఏంటనేది తెలియదు గానీ.. ఈ వ్యవహారం మాత్రం ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే ఉంది. ఇండైరెక్ట్‌గా త్రివిక్రమ్(Trivikram)ను టార్గెట్ చేస్తునే ఉన్నాడు బండ్లన్న. అలాంటి బండ్ల గణేష్.. ఈ రోజు త్రివిక్రమ్‌కు బర్త్ డే విషెస్ చెప్పడం ఇంట్రెస్టింగ్గా మారింది. నవంబర్ 7న పుట్టినరోజు వేడుకలు గ్రాండ్‌గా జరుపుకున్నాడు త్రివిక్రమ్. మాటల మాంత్రికుడికి సోషల్ మీడియా వేదికగా చాలామంది బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. బండ్ల గణేష్ కూడా.. ‘త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు.. మీకు జన్మదిన శుభాకాంక్షలు. గుంటూరు కారం సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను’ అని పోస్ట్ చేశారు. దీంతో పవన్, త్రివిక్రమ్ అభిమానులు షాక్ అవుతున్నారు. సడెన్ గా బర్త్ డే విషెస్ ఎందుకు చెప్పాడు? అసలు బండ్లన్న, త్రివిక్రమ్ మధ్య ఏం జరుగుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.