»Bandla Ganesh Comments On Revanth Reddy Biopic Movie
Bandla ganesh: రేవంత్ రెడ్డి ఓకే అంటే తన బయోపిక్ తీస్తా
తెలంగాణ కాబోయే సీఎం రేవంత్ రెడ్డి గురించి సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్(bandla ganesh) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఓకే అంటే తన బయోగ్రఫీ గురించి బ్లాక్ బస్టర్ సినిమా తీస్తానని వెల్లడించారు. అంతేకాదు ఆ సీన్ల గురించి విశ్లేషణ కూడా చేశారు.
bandla ganesh comments on revanth reddy biopic movie
తెలంగాణలో మరికొన్ని గంటల్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే రేవంత్ రెడ్డి గురించి సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్(bandla ganesh) కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఒప్పుకుంటే తన బయోగ్రఫీ మొత్తాన్ని ఓ సినిమాగా(cinema) తెరకెక్కించనున్నట్లు ఓ మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో భాగంగా బండ్ల గణేష్ వెల్లడించారు. ఒక వీరుడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో రేవంత్ స్టోరీ అంత గొప్పగా ఉంటుందని చెప్పారు. తెలంగాణ ప్రజల కోసం తాను అనుకున్నది సాధించారని తెలిపారు. రేవంత్ రాజకీయంగా పరిణితి చెందిన వ్యక్తి అని అన్నారు. కొండారెడ్డి పల్లిలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించిన వ్యక్తి ఎన్నో కష్టాలు, సవాళ్లను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారని వెల్లడించారు.
రేవంత్ రెడ్డి(revant reddy) జర్నీ మొత్తాన్ని ఒక మంచి సినిమా తీసేంత స్టఫ్ ఉందని బండ్ల గణేష్ స్పష్టం చేశారు. అంతేకాదు ఈ సినిమా తీస్తే బ్లాక్ బాస్టర్ హిట్టు అవుతుందన్నారు. ఈ చిత్రంలో 60 సీన్లు ఉంటాయన్నారు. రేవంత్ అన్నలాంటి వీరుడి కథ తీస్తే మాములుగా ఉండదు..బాక్సాఫీస్ రికార్డులు పగిలిపోతాయన్నారు. రేవంత్ ఇంటి దగ్గర స్కూల్ జర్నీ నుంచి హైదరాబాద్ వచ్చి డిగ్రీ చేయడం ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకోవడం వరకు అనేక అంశాలు ఉన్నాయని బండ్ల గణేష్ చెప్పారు.
అంతేకాదు ఎన్నో ఆశల నడుమ తన కుమార్తె పెళ్లి జరిపిస్తుండగా కొన్ని రాజకీయ శక్తులు అడ్డుకున్నాయని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డిని తన కుమార్తె(daughter marriage) వివాహాన్ని సంతోషంగా జరుపుకోలేని విధంగా చేశారని అన్నారు. అంతేకాదు 17 ఏళ్లుగా రేవంత్ రెడ్డికి తన భార్య(wife) ఎంతో మద్దతుగా నిలిచిందని బండ్ల గణేష్ పేర్కొన్నారు. ఇలాంటి క్రమంలో రేవంత్ ఎన్నో ఏండ్లుగా ప్రజల కోసం చేస్తున్న పోరాట ఫలితం ఇప్పుడు దక్కిందన్నారు.