»Telangana Re Election For Sarpanch In January Or February Election Commission Announcement
Telangana:లో జనవరిలో మళ్లీ ఎన్నికలు..ఎన్నికల సంఘం కీలక ప్రకటన
తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కానుంది. ఇటివలనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగా..జనవరి లేదా ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
Telangana re election for sarpanch in January or february Election commission announcement
తెలంగాణ(telangana)లో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. త్వరలో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్(notification) వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కసరత్తు ప్రారంభించాలని సూచిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు పంపారు. చివరి సర్పంచ్ ఎన్నికలు 2019 జనవరిలో 3 దశల్లో జరిగాయి. గ్రామాల్లో ఫిబ్రవరి 1 నాటికి సర్పంచ్‌తోపాటు కొత్త కార్యవర్గాన్ని నియమించగా.. వారి పదవీకాలం ఫిబ్రవరి 1, 2024తో ముగియనుంది. నిబంధనల ప్రకారం ఈలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు ప్రకటించాలి.
అయితే పదవీకాలం ముగియడానికి 3 నెలల ముందు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలి. అయితే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కారణంగా ప్రక్రియ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. త్వరలో కొత్త శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం(telangana election commission) అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ వంటి కార్యక్రమాలను ప్రారంభించాలని ఎన్నికల సంఘం కలెక్టర్లకు సూచించింది.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల వివరాలను గ్రామ కార్యదర్శులు ఇప్పటికే పంపించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు పదేళ్లపాటు రిజర్వేషన్లు వర్తించేలా 2019లో రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఈ నేపథ్యంలో గతసారి రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి(revanth reddy) సారథ్యంలోని కొలువుదీరే ప్రభుత్వం రిజర్వేషన్ల మార్పు నిర్ణయం తీసుకుంటే.. అధికారులు నిర్ణీత సమయానికి కొత్త రిజర్వేషన్లకు సంబంధించి వివరాలు అందజేస్తే తప్ప రిజర్వేషన్లు మారే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కొత్తగా ఏర్పాటైన పంచాయతీలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 13 వేలకు పైగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. బ్యాలెట్ పద్ధతిలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లలో నోటా గుర్తు కూడా ఉంటుంది. ఎప్పటిలాగే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉప సర్పంచ్‌ను పాత పద్ధతిలోనే చేతులు ఎత్తడం ద్వారా ఎన్నుకుంటారు. ఏ కారణం చేతనైనా అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక సాధ్యం కాకపోతే మరుసటి రోజు నిర్వహిస్తారు. ఈసారి డిసెంబర్ చివరి వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో సర్పంచ్(sarpanch) ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలంగాణ ఎన్నికల కమిషన్ ప్రకటించింది.