Bandla Ganesh: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇంతకు ముందు బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. అయితే బండ్ల అన్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచింది. సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లను బండ్ల గణేష్ పరిశీలించారు. రేవంత్ రెడ్డి సీఎం కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అతని ప్రమాణ స్వీకారం స్వయంగా చూస్తానని అన్నారు.
ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చూసి ఈ రోజు రాత్రి ఈ స్టేడియంలోనే నిద్రపోతానని బండ్ల గణేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి చాలా కష్టపడ్డాడని తెలిపారు. తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వచ్చాయని అన్నారు. అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలన్ని అతను పూర్తి చేస్తారని ధీమా వ్యక్తం చేశఆరు. తనకు ఎలాంటి పదవులు వద్దని అన్నారు. తాను ఏం ఆశించడం లేదని, పార్టీ కోసం పనిచేశానని అన్నారు. బంగారు తెలంగాణ.. కాదు. కాదు.. బంగారమే తెలంగాణ అని ఆయన వ్యాఖ్యానించారు.