»Priyanka Chopra Becomes Latest Target Of Deepfake After Alia Bhatt Rashmika Mandanna Kajol And More
Priyanka Chopra: ప్రియాంక చోప్రా డీప్‌ఫేక్ వీడియో వైరల్!
డీప్‌ఫేక్ వీడియోలు సెలబ్రిటీలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. తాజాగా ప్రియాంక చోప్రాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇది వరకే రష్మిక మందన్న, అలియా భట్, కాజోల్ వీడీయోలను చూశాము. ఇప్పుడు ప్రియాంక వంతు వచ్చింది. అచ్చం తనలానే ఉండే వాయిస్‌తో డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేశారు.
Priyanka Chopra becomes latest target of deepfake after Alia Bhatt, Rashmika Mandanna, Kajol and more
Priyanka Chopra: నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra) డీప్‌ఫేక్(deepfake) వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఇంతకు ముందులా కాకుండా ఈ సారి వినుత్నంగా ట్రై చేశారు ఆకతాయిలు. ప్రియాంక చోప్రా వాయిస్‌ను మార్చారు. ఓ ప్రముఖ కంపెనీకిి చెందిన ప్రొడక్ట్ గురించి ప్రియాంక చెప్తుంది. అయితే అది మాత్రం నిజం కాదు. తను ఓ వీడియోలో మాట్లాడిన దానిని అసలు ఆడియో స్థానంలో నకిలీ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌తో ఆమె వాయిస్ మార్ఫింగ్ చేశారు. డీప్‌ఫేక్ వీడియోలో ఈ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు ఉంది. అంతే కాకుండా దానిని వాడడం వలన తన ఆదాయం పెరిగిందని, అందరూ దాన్నే వాడాలని చెప్తున్నట్లు ఆ వీడియోలో ఉంది.
ఇది చూసిన అనేక మంది చాలా ప్రమాదకరమని అంటున్నారు. తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించడమే కాకుండా సెలబ్రిటీల ప్రతిష్టత దెబ్బతీసేలా ఉందని చెబుతున్నారు. అలియా భట్(Alia Bhatt), కత్రినా కైఫ్(Katrina Kaif), కాజోల్, రష్మిక మందన్న ఇదివరకే డీప్ ఫేక్ బారిన పడిన విషయం తెలిసిందే. వారి ఫేస్‌ను మార్ఫింగ్ చేశారు. ఇబ్బందికరమైన వీడియోల్లో ఆ హీరోయిన్లను చూసి అభిమానులు కంగారు పడ్డారు. తరువాత అది ఫేక్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.
తాజాగా వాయిస్ మార్చడంతో అభిమానులు సైతం కంగారు పడుతున్నారు. ఇప్పటికే ఈ డీప్‌ఫేక్ వీడియోలపై భారత ఐటీ విభాగం అప్రమత్తం అయింది. వాటిపై చర్య తీసుకుంటామని ఇటీవల కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే ఇంకా చాలా మంది సామాన్యులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉన్నట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను తొలగించడంతో పాటు, భద్రత దృష్ట్యా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వివిధ ప్లాట్‌ఫామ్స్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు కేంద్రమంత్రి తెలిపారు.