జనతా గ్యారేజ్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. ఈసారి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు ఎన్టీఆర్, కొరటాల శివ. ప్రస్తుతం దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్న దేవర టీజర్‌ను త్వరలోనే రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Devara: ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర (Devara) సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుంది. ఈ లెక్కన సరిగ్గా మరో నాలుగు నెలల్లో థియేటర్లోకి రానుంది దేవర. ఇప్పటి వరకు దేవర నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. విలన్, హీరోయిన్ లుక్స్ కూడా రివీల్ చేశారు. దీంతో దేవర టీజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ముందుగా అనుకున్నట్టుగా న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న దేవర నుంచి టీజర్, లేదా గ్లింప్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందనుకున్నారు. అప్పటికీ లేదంటే సంక్రాంతికి దేవర సాలిడ్ ట్రీట్ ఉంటుందని అనుకున్నారు.
ఇప్పుడు దేవర టీజర్ డేట్ మరింత ముందుకొచ్చింది. లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం దేవర ఫస్ట్ లుక్ టీజర్‌ని క్రిస్మస్ సందర్భంగా అంటే, డిసెంబర్ 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అతి త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. దీంతో దేవర టీజర్ బయటికి రావడమే లేట్.. అన్నీ రికార్స్డ్ బద్దలు అవ్వడం ఖాయమని అంటున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్.
సినిమాతో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ కలిసి భారీ ఎత్తున నిర్మిస్తున్నాయి. మరి దేవర టీజర్ అప్డేట్ ఎప్పుడుంటుందో చూడాలి.