Bandla Ganesh: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు ఈ మేరకు తీర్పు నిచ్చింది. బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది. కోర్డు ఇచ్చిన తీర్పును అప్పీల్ చేసుకునేందుకు ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు నెలరోజుల గడువు కూడా ఇచ్చింది. జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి బండ్ల గణేష్ నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ నుంచి ఇచ్చిన చెక్ బౌన్స్ కారణంగా కోర్టులో కేసు వేశారు. ఈ కారణంగా అతనికి ఏడాది జైలు శిక్ష విధించడంతో పాటు జరిమానా విధించారు.