ATP: అమెరికా, ఇజ్రాయిల్ మరణకాండకు నిరసనగా అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద మంగళవారం ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ.. 7 శతాబ్దాలుగా ప్రపంచంలో జరిగే యుద్ధాలు మరణకాండకు మూల కారణం అమెరికా దేశమని వారు పేర్కొన్నారు. ఇరాన్‌పై మారణకాండ ఆపాలన్నారు.
సత్యసాయి: హిందూపురం పట్టణంలోని ఆల్ హిలాల్ హైస్కూల్ మైదానంలో ఈ నెల 6న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీడీపీ మైనార్టీ నాయకులతో కలిసి మున్సిపల్ ఛైర్ పర్సన్ రమేష్ కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులందరికీ ఆహ్వాన లేఖలు పంపి, కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ATP: ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మంగళవారం నార్పల గ్రామానికి చెందిన గవ్వల శివశంకర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్‌లో వన్యప్రాణులకు స్వచ్ఛందంగా సేవ చేస్తున్న వారిని గుర్తించి ప్రభుత్వం సన్మానించింది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ శివశంకర్‌కు ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు.
KKD: కాకినాడ బీజేపీ జిల్లా మీడియా ఇన్‌ఛార్జ్‌గా చక్ర రమేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు మంగళవారం ఆయనకు నియామక పత్రం అందజేశారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చాటిచెప్పాలని కోరారు. పార్టీ సిద్ధాంతాలను మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని రమేశ్‌కు ఆయన సూచించారు.
CTR: జిల్లా అదనపు ఎస్పీ రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో, పోలీసులు వాహన పత్రాలు, లైసెన్స్‌లు, హెల్మెట్ వాడకం, మద్యం తాగి వాహనాలు నడపడాన్ని తనిఖీ చేస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా, ప్రజా భద్రతను, నేరాలను నిరోధించడానికి ఇంటెన్సివ్ వెహికల్ చెక్‌లు నిర్వహిస్తున్నారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను కూడా పర్యవేక్షిస్తున్నారు.
మార్కాపురంలోని కందుల నారాయణ రెడ్డి సమక్షంలో వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. పొదిలి మండలం కుంచెపల్లి గ్రామానికి చెందిన వరికుంట్ల పౌలు, వరికుంట్ల వినోద్ ఆధ్వర్యంలో సుమారు 15 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పొదిలి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
GNTR: రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం జరిగిన సుదీర్ఘ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పలు సూచనలు ఇచ్చినట్లు వెల్లడించారు.
ఏలూరు జిల్లా బయాలజీ ఫోరం ఆధ్వర్యంలో జిల్లాలో ఉత్తమ సేవలందించిన 15 మంది జీవశాస్త్ర ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో సన్మానించారు. జిల్లా ఉమ్మడి పబ్లిక్ పరీక్షల కార్యదర్శి సర్వేశ్వరరావు పాల్గొని బయాలజీ ఫోరం విశిష్టతలను వివరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జీ.గంగాధర్ ఫోరం ఆవిర్భావం, సేవలను వివరించారు.
SKLM: ఎంపీ రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీలోని రైల్ భవన్‌లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మంగళవారం భేటీ అయ్యారు. శ్రీకాకుళం ప్రజల దీర్ఘకాల డిమాండ్ అయిన సికింద్రాబాద్, తిరుపతికి నేరుగా రైళ్లు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. మందస పాతపట్నం స్టేషన్లలో పలు రైళ్లు నిలుపుదల కల్పించాలని కోరారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు.
CTR: తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో డా. ఏ.శరత్ పలమనేరు గోశాలను మంగళవారం పరిశీలించారు. పశువులకు సమయానికి మేత, త్రాగునీరు, వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. 450 ఎకరాల్లో విస్తరించిన గోశాలలో ప్రస్తుతం 542 పశువులు ఉన్నాయని తెలిపారు. పచ్చిమేత సాగును విస్తరించాలని, పరిశుభ్రత, సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
BPT: చందోలులో శ్రీ చెన్నకేశవ స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. జీర్ణోద్ధరణ చేసిన నూతన మండపంలో అర్చకులు ఆగమ శాస్త్రం ప్రకారం వివాహ వేడుకను నిర్వహించారు. నిత్య హోమం, ప్రత్యేక పూజలతో పాటు గరుడసేవ, రథోత్సవం కనులపండువగా సాగాయి. భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఛైర్మన్ సాయి గుప్తా, ఈఓ నరసింహమూర్తి వెల్లడించారు.
ATP: జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, సెప్టేజ్ అభివృద్ధికి రూ.736.27కోట్ల నిధులు మంజూరైనట్లు MP అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. అమృత్ 2.0, ఏఐఐబీ పథకాల కింద అనంతపురం, తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, గుత్తి, కళ్యాణదుర్గం పట్టణాల్లో పనులు చేపట్టనున్నారు. ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభం కానున్నాయని, ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందుతుందని పేర్కొన్నారు.
NDL: కూటమి ప్రభుత్వంపై మాజీమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే నేరాన్ని ప్రోత్సహిస్తోందని మంగళవారం ధ్వజమెత్తారు. జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం బుగ్గన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త సంస్కృతులను తెచ్చారని విమర్శించారు. జోగి రమేష్ ఇంటిపై దాడి వీడియో చూస్తే అర్థమవుతుందని అన్నారు.
SKLM: అంగన్వాడీల పై ప్రభుత్వ నిర్బంధకాండ అమానుషం అని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు అన్నారు. మంగళవారం శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ నుండి డే &నైట్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీలకు వేతనాలు వెంటనే పెంచాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
AKP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాయకరావుపేట సర్కిల్ పోలీస్ స్టేషన్ సీఐ అప్పన్న ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా హిమాగ్లోబిన్‌కు సంబంధించి పరీక్షలు నిర్వహించి ఐరన్ టాబ్లెట్స్ పంపిణీ చేశారు. అలాగే ఆరోగ్య విషయాలపై పోలీసులు పలు సూచనలు చేశారు.