W.G: ఉండి మండలం మహాదేవపట్నం హైస్కూల్లో వీరవల్లి మహేష్ ఇంటర్వెల్లో మరో విద్యార్థి కాలు తగిలి పడిపోగా మహేష్‌కి చెయ్యి విరిగిందని పాఠశాల HM జాన్ బాబు బుధవారం తెలిపారు. అతనికి వైద్య ఖర్చులు రూ. 20 వేల అయ్యిందని మహేష్ తండ్రి పెద్దిరాజు తెలిపారు. ఈ విషయం వసుధ ఫౌండేషన్ దృష్టికి తీసికెళ్లగా వారు రూ .10 వేలు, పాఠశాల సిబ్బంది రూ. 10 వేలను పెద్దిరాజుకు అందించారు.
ప్రకాశం: మార్కాపురం జిల్లా నూతన ఆర్డీవోగా ప్రభాకర్ నియమితులయ్యారు. ఈయన గుంటూరు జిల్లా నుంచి బదిలీపై రానున్నారు. ఇప్పటివరకు మార్కాపురం ఇన్చార్జి సబ్ కలెక్టర్‌గా పని చేసిన వెంకట శివరాంరెడ్డి వెలుగొండ ప్రాజెక్టుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా వెళ్లనున్నారు. అధికారుల ఉత్తర్వుల మేరకు ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం ఆర్డీవో బాధ్యతలు స్వీకరించనున్నారు.
VSP: సింహాచలం వరాహలక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో బుధవారం సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తుల, గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో కమనీయంగా జరిపించారు.
ATP: జిల్లాలోని 15 ఏపీ మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఐదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 24 నుంచి మార్చి 31 వరకు apms.apcfss.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.200, ఎస్సీ, ఎస్టీలు రూ.125 ఫీజు చెల్లించాలని అధికారులు కోరారు.
PPM: అకాల వర్షం కారణంగా సాలూరు మండలం కొత్తవలస, మరిపల్లి, కందులపదం, కురుకుట్టి, మమడిపల్లి, తదితర రైతు సేవాకేంద్రాల పరిధిలోని గ్రామాల్లో మొక్కజొన్న పంట నష్టానికి గురి అయిందని మండల వ్యవసాయ అధికారి శిరీష తెలిపారు. పై గ్రామాల్లో సుమారు 45 మంది రైతులకు సంబంధించి 60 ఎకరాల పంట అకాల వర్షానికి దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు.
VZM: మెరకముడిదాం మండలం గర్భాంలో పంచాయతీ EO విశ్వనాథం పర్యవేక్షణలో బుధవారం పారిశుద్ధ్య కార్మికులు గ్రామంలో రోజువారి పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా చెత్త కుప్పలను ఎత్తివేసి టాక్టర్ సహాయంతో డంపింగ్ యార్డ్‌కి తరలించారు. రోడ్లపై చెత్త వెయ్యరాదని పంచాయతీ వాహనాలు వచ్చినప్పుడు చెత్తని అందించాలని EO సూచించారు.
KRNL: తనకు భద్రత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాటసాని రాంభూపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం పోలీసు భద్రతనేది హోదాగా మారిందని, దానికి ప్రభుత్వ ధనం ఎందుకు ఖర్చు చేయాలని CJI ధర్మాసనం కాటసాని లాయర్ను ప్రశ్నించింది. శక్తిమంతులైన మీరు ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.
TPT: సూళ్లూరుపేట పట్టణంలో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కొత్త సబ్ ఇన్‌స్పెక్టర్‌ను IDJN తిరుపతి జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలో శాంతి భద్రతలను సమర్థవంతంగా పరిరక్షిస్తూ ప్రజలకు మరింత చేరువగా పనిచేయాలని కిరణ్ కుమార్ ఆకాంక్షించారు.
కృష్ణా: 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పులిగడ్డ గురుకులం(బాలురు)లో 5, 6వ తరగతుల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేపట్టనున్నట్లు ప్రధానాచార్యులు కె. జాన్ వెల్లడించారు. దరఖాస్తులు ఆన్‌లైన్ విధానంలో స్వీకరిస్తామని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 31వ తేదీలోపు తమ దరఖాస్తులను సమర్పించాలన్నారు.
ASR: పోలవరం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు పంపిణీ చేస్తున్న చిక్కీల (పల్లీ అచ్చులు) నాణ్యతపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రంపచోడవరం, చింతూరు డివిజన్లలోని పాఠశాలలకు అందుతున్న చిక్కీలలో పురుగులు కనిపిస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.
VSP: కంబాలకొండలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక అభివృద్ధికి బృహత్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు VMRDA మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ తెలిపారు. ఈఎస్ జెడ్ పరిధిలో 30.51 చ.కి.మీ. విస్తీర్ణానికి ముసాయిదా జోనల్ మాస్టర్ ప్లా రూపొందిస్తున్నారు. రహదారుల అనుసంధానం, భవిష్యత్ రహదారి మార్గాలు స్పష్టంగా చేర్చాలని సూచించారు.
ATP: గుత్తి కోటవీధిలోని ప్రాథమిక పాఠశాల వద్ద మహమ్మద్ అనే విద్యార్థిపై బుధవారం కుక్క దాడి చేసి గాయపరిచింది. ఈ దాడిలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. కోటవీదిలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ స్థానిక గాంధీ బొమ్మ ప్రాంతంలో నుడా ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న “ఐ లవ్ నెల్లూరు” బోర్డు ఏర్పాటు పనులను అధికారులతో కలిసి బుధవారం పర్యవేక్షించారు. అనంతరం స్థానిక మినీ బైపాస్ నర్సరీల సమీపంలో నూతనంగా భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ పనులను నుడా అధికారులతో కలిసి పరిశీలించారు.
AKP: స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కోటవురట్ల మండలంలో మూడు పంచాయతీలకు పుష్ కార్ట్స్‌తో పాటు తడి, పొడి, ప్రమాదకరమైన చెత్త సేకరణకు డస్ట్ బిన్‌లను ప్రభుత్వం సరఫరా చేసింది. వీటిని కోటవురట్ల తంగేడు, టి. జగ్గంపేట పంచాయతీలకు కేటాయిస్తున్నట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ బుధవారం తెలిపారు. వీటి ద్వారా చెత్త సేకరణ చేసి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
PLD: రాజుపాలెం మండలం ఉప్పలపాడులో గ్రామంలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. గ్రామంలోని నీటి ట్యాంకు సమీపంలో మృతదేహం కనిపించినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలు వేల్పుల మల్లేశ్వరి (45)గా గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.