VZM: డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కలియుగ దైవం, ప్రపంచ పవిత్ర పుణ్య క్షేత్రంలో బి ఆర్ నాయుడు లాంటి స్త్రీ లోలుడును ఛైర్మన్‌గా కోనసాగించడం తిరుమల పవిత్రతను దెబ్బ దీయడమే అని ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి ఆయనను తక్షణమే తొలగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు శ్రీనువాసరావు పాల్గొన్నారు.
NDL: జిల్లాకు చెందిన నరేంద్ర (35) అనే రాడ్ బెండింగ్ కార్మికుడు గుంటూరు జిల్లా తెనాలిలో సోమవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే భార్య ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మృతుడి భార్యతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
CTR: రామకుప్పం మండలం పెద్దగానూరులో RYSS ఆధ్వర్యంలో నిర్వహించిన నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమంలో APSRTC వైస్ ఛైర్మన్ మునిరత్నం పాల్గొని రైతులతో సమావేశమయ్యారు. జీవామృతం, సహజ ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. రైతుల అనుభవాలు తెలుసుకొని, క్షేత్రాలను పరిశీలించి సూచనలు ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని తెలిపారు.
సత్యసాయి: తనకల్లు(మం) బాలసముద్రం పంచాయతీ గోవిందువారిపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణానికి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యకార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు.
TPT: సూళ్లూరుపేటలో ఆస్తి పన్ను బకాయిలపై ప్రభుత్వం 50% వడ్డీ మాఫీ ప్రకటించిందని మునిసిపల్ కమిషనర్ చిన్నయ్య తెలిపారు. ఈ మాఫీ 31 మార్చి 2026 వరకు మాత్రమే అమల్లో ఉంటుందన్నారు. గడువు ముగిసిన తర్వాత పూర్తి వడ్డీ, జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు ఆలస్యం చేయకుండా వెంటనే బకాయిలు చెల్లించాలని సూచించారు.
ELR: ఉంగుటూరు మండల తల్లాపురం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నల్లా నాగేంద్ర రావు ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను మంగళవారం ఎన్రోల్మెంట్ డ్రైవ్ ప్రారంభించారు. 5 సంవత్సరాల వయస్సు నిండిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను బోధన జరుగుతుందని ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి వివరించారు.
అన్నమయ్య: గాలివీడు మండలంలో రైతులకు వెలిగల్లు ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారా సాగునీరు అందించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్ డిమాండ్ చేశారు. బోర్లు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఐదు గ్రామాల చెరువులు, గుంటలకు నీరు ఇవ్వాలని కోరారు. సాగునీరు వచ్చే వరకు పోరాటాలకు సిద్ధం కావాలని రైతులకు పిలుపునిచ్చారు.
KRNL: జిల్లా వ్యాప్తంగా మంగళవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 358 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. మొత్తం 18,104 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 17,746 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. 358 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
KDP: జిల్లాలో గ్యాస్ కొరతపై వస్తున్న వదంతులు పూర్తిగా అసత్యమని జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా స్పష్టం చేశారు. జిల్లాలో గృహ అవసరాలకు తగినంత ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని 58 గ్యాస్ ఏజెన్సీలపై ప్రత్యేక అధికారులను నియమించి, జిల్లా, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గ్యాస్ సరఫరా సాధారణంగానే కొనసాగుతుందన్నారు.
KKD: ఉద్యోగ ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ కమిషన్ వేసి IR వెంటనే ప్రకటించాలని PDF టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి డిమాండ్ చేశారు. పిఠాపురం మండలంలో పలు హై స్కూల్స్‌ను ఆయన సందర్శించి, టీచర్స్ ఇబ్బందులను తెలుసుకున్నారు. 2023 జూన్‌తో 11వ పీఆర్సీ ముగిసిపోగా, 12వ పీఆర్సీ అమలు చేయకపోవడంతో ఉద్యోగ టీచర్స్ నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు.
ప్రకాశం: రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా పెద్దారవీడు మండలం సానికవరం గ్రామంలో మంగళవారం టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మూడో విడత పంపిణీ గురించి రైతులకు వివరించారు. ఎన్నికల్లో చెప్పినట్లుగానే ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
బాపట్ల మండలం ముత్తాయిపాలెం ప్రాథమిక పాఠశాలలో శక్తి టీం ఆధ్వర్యంలో గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు “నో-గో-టెల్” విధానం గురించి వివరించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
SS: నేతన్నల ఆరోగ్య రక్షణకు ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’తో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. మంగళవారం ధర్మవరంలో నిర్వహించిన మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. త్వరలోనే నేతన్న భరోసా పథకం కింద రూ.25 వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు చెప్పారు. ధర్మవరం పట్టు చీరలకు మరింత ప్రాచుర్యం కల్పిస్తామని తెలిపారు.
ATP: రాష్ట్రంలో దివ్యాంగులకు రేపటి నుంచి RTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు మంగళవారం తెలిపారు. పల్లె వెలుగు నుంచి మెట్రో ఎక్స్‌ప్రెస్ వరకు అన్ని సర్వీసుల్లో ఈ వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. ‘దివ్యాంగ శక్తి’ పథకం ద్వారా కూటమి ప్రభుత్వం వీరికి భరోసా కల్పిస్తోందని ఆయన చెప్పారు.