• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేసిన కలెక్టర్

TPT: తూకివాకం పంచాయితీ ఎస్.యన్.పురంలో కలెక్టర్ వెంకటేశ్వర్లు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేశారు. లబ్ధిదారుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేశామని చెప్పారు. ఇవాళ పింఛన్ తీసుకోనివారు సోమవారం కూడా పింఛన్ తీసుకోవచ్చని తెలిపారు.

February 28, 2026 / 11:45 AM IST

రేపు రాష్ట్రస్థాయి హాకీ ఎంపిక పోటీలు

AKP: ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో రేపు సబ్ జూనియర్స్ బాలుర, బాలికల రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ కొఠారు నరేష్ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు పోటీలు ప్రారంభం అవుతాయన్నారు. 2010 అక్టోబర్ 1 తరువాత జన్మించిన వారు అర్హులుగా పేర్కొన్నారు.

February 28, 2026 / 11:40 AM IST

అంగన్వాడీలకు వేసవి సెలవులు పెంపు..?

KDP: అంగన్వాడీలకు వేసవి సెలవులు 15 నుంచి 30 రోజులకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. జీతాలు పెంచాలని ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు రాష్ట్ర ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవాలన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. త్వరలో దీనిపై కీలక అప్‌డేట్ వస్తుందన్నారు.

February 28, 2026 / 11:39 AM IST

కంపమల్లలో అధ్వానంగా మురుగు కాలువలు

NDL: కోవెలకుంట్ల (M) కంపమల్ల గ్రామంలోని రాజ కాలనీలో మురుగు కాలువలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. వ్యర్థాలు పేరుకుపోవడంతో మురుగునీరు ప్రవహించక నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది.ఈ కారణంగా దోమల బెడద పెరిగి రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని కాలనీవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు రోడ్లపైకి చేరుతుండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

February 28, 2026 / 11:39 AM IST

‘గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం’

KRNL: ఆలూరు నియోజకవర్గం మానేకుర్తి గ్రామపంచాయతీ పరిధిలోని అంగస్కల్ గ్రామంలో శ్రీమతి వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు దాదావళి,డీలర్ దేవేంద్ర, విద్యా కమిటీ ఛైర్మన్ ఉసేన్ చేతుల మీదిగా ఇవాళ పింఛన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు యంకప్ప, కార్యకర్తలు నగేష్, బూత్ ఇంచార్జీ మౌలాలి పాల్గొన్నారు.

February 28, 2026 / 11:34 AM IST

కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి

NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంను శనివారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు.

February 28, 2026 / 11:33 AM IST

ఫిట్నెస్ లేని పడవలు సీజ్.. యధాతధంగా ప్రయాణం

PDL: కృష్ణనదిలో ప్రయాణం చేసే పడవలకు ఫిట్నెస్ లేదని MPDO శ్రీనివాసరావు CI శ్రీనివాస్‌లు గత 3మాసాల క్రితమే, పడవలను సీజ్ చేశారు. మాదిపాడు, గింజుపల్లి, తాడువాయి, చామర్తి, KVపాలెం నది ప్రాంతంలో యధా విధంగా మళ్లీ పడవ ప్రయాణం సాగుతుందని స్థానిక ప్రజలు తెలిపారు. ఫిట్నెస్ లేకుండా పడవ ప్రయాణం కొనసాగడం, ప్రజల ప్రాణాలతో చెలగాట మాడటమేనని ప్రజలు మండిపడ్డారు.

February 28, 2026 / 11:33 AM IST

పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

GNTR: పిడుగురాళ్ల 7వ వార్డులో శనివారం ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఆదివారం సెలవు కావడంతో ప్రభుత్వం ఒక రోజు ముందుగానే పంపిణీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. సచివాలయ సిబ్బంది ద్వారా ఎంతో పారదర్శకంగా, లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్లు చేరుస్తున్నామని పేర్కొన్నారు.

February 28, 2026 / 11:30 AM IST

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు: బొడ్డు

E.G: కోరుకొండ మండలం గాడాల గ్రామంలో శనివారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రూడా చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. గ్రామానికి చెందిన లబ్ధిదారులకు పింఛన్ అందజేసి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు అండగా నిలబడటం తమ బాధ్యత అన్నారు.

February 28, 2026 / 11:30 AM IST

అహోబిలం పీఠాధిపతిని ఆహ్వానించిన అర్చకులు

ATP: తాడిపత్రిలోని చింతల వెంకటరమణస్వామి దేవస్థానాన్ని సందర్శించాలని అహోబిల మఠం పీఠాధిపతులు శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికులను ఆలయ అర్చకులు శ్రీ చింతలరాయన్ ఆహ్వానించారు. అహోబిలంలో పీఠాధిపతిని కలిసి స్వామివారి మర్యాద మాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుప్పావై సేవ కార్యక్రమ నిర్వహణ తీరుపై పీఠాధిపతితో చర్చించారు.

February 28, 2026 / 11:30 AM IST

లక్ష్మీ నరసింహ స్వామికి వైభవంగా పల్లకి సేవ

ప్రకాశం: కనిగిరి కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలో వేంచేసియున్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామి వారికి పల్లకి సేవాకార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. దేవస్థానం అర్చకులు చోడా వీరభద్రస్వామి పూజలు నిర్వహించి భక్తులుకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు కుందూరు తిరుపతిరెడ్డి భక్తులు పాల్గొన్నారు.

February 28, 2026 / 11:27 AM IST

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు

NDL: బ్రాహ్మణ కొట్కూరు గ్రామం సమీపంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై మణికంఠ తెలిపారు. వారి నుంచి రూ. 42,290 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.

February 28, 2026 / 11:26 AM IST

మూడు నెలల జీతాలు విడుదల..!

ఉమ్మడి ప.గో: జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల వేతనాల నిలిపివేతపై ప్రభుత్వం స్పందించింది. సభ్యుల ఆర్థిక ఇబ్బందులను ZP ఛైర్‌పర్సన్ పద్మశ్రీ సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ప్రభుత్వం తక్షణమే మూడు నెలల బకాయి వేతనాలను విడుదల చేసింది. ప్రభుత్వ సత్వర నిర్ణయం పట్ల ఉమ్మడి జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

February 28, 2026 / 11:26 AM IST

పింఛన్లు అందజేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ పరిధిలోని 20వ డివిజన్ వనంతోపులో శనివారం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి అని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పెన్షన్ల నగదు పెంచిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు.

February 28, 2026 / 11:24 AM IST

పీఏసీ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

W.G: అమరావతి అసెంబ్లీ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన పబ్లిక్ ఎక్కౌంట్స్ కమిటీ, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన సమీక్షా సమావేశంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ సభ్యుడి హోదాలో పాల్గొని ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవహారాలు, ఆదాయం, ఖర్చులను అక్కౌంట్స్ నమోదు చేస్తాయని చెప్పారు.

February 28, 2026 / 11:16 AM IST