• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

తలముడిపిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం

NDL: మిడుతూరు మండలం తలముడిపిలో రైతన్న మీకోసం, అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MLA జయసూర్య నేడు హాజరయ్యారు. PM కిసాన్ 3వ విడత నిధులు రూ.6 వేలు, రాష్ట్రం వాటా రూ.14 వేలు ఇచ్చిందని, రైతుల ఇంటికి వెళ్లి బాగోగులు తెలుసుకుని, అన్నదాత సుఖీభవ కరపత్రాలు పంపిణీ చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

March 17, 2026 / 02:03 PM IST

JCB నడిపిన కదిరి ఎమ్మెల్యే కందికుంట

సత్యసాయి: జల సంరక్షణే లక్ష్యంగా తనకల్లు మండలం గోవిందు వారి పల్లిలో ‘మన పల్లె-మన నీరు’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భూగర్భ జలాల పెంపు కోసం చేపట్టిన చెరువు పూడిక తీత పనులను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం ఎమ్మెల్యే జేసీబీ నడిపి అలరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

March 17, 2026 / 02:00 PM IST

నరసాపురం గ్యాస్ గోడౌన్లలో RDO తనిఖీ

W.G: నరసాపురం పట్టణంలోని భారత్, హెచ్.పీ గ్యాస్ గోడౌన్లను RDO దాసి రాజు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహశీల్దార్ ఐ.వి.వి. సత్యనారాయణతో కలిసి స్టాక్ రిజిస్టర్లు, సిలిండర్ల నిల్వలను పరిశీలించారు. గ్యాస్ పంపిణీలో పారదర్శకత పాటించాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమాలకు తావులేకుండా నిబంధనలు పాటించాలని ఆదేశించారు.

March 17, 2026 / 02:00 PM IST

దాతృత్వం చాటుకున్న పోలీస్

అన్నమయ్య: రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పవన్ కుమార్ దాతృత్వం చాటుకున్నారు. రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్‌లో గర్భిణీకి O పాజిటివ్ రక్తం అత్యవసరం అవ్వగా, ఫోన్ చేసిన వెంటనే ఆయన స్పందించి రక్తదానం చేశారు. సొంత ఖర్చులతో పేద స్టూడెంట్స్‌కు మెటీరియల్స్ అందిస్తూ, వివాహం చేసుకొనే పేద ఆడపిల్లలకు తనకు తోచినంత డబ్బులు సహాయం చేస్తూ సేవా భావం చాటుకుంటు ఉంటారు.

March 17, 2026 / 02:00 PM IST

గుండెపోటుతో వైసీపీ నేత మృతి

KRNL: పత్తికొండకు చెందిన వైసీపీ నేత, మాజీ ఎంపీటీసీ దేవరగట్టు గణపతి ఇవాళ గుండెపోటుతో మరణించారు. ఆయన రెండుసార్లు ఎంపీటీసీగా పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారంలో చురుగ్గా పాల్గొనేవారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, అనుచరులు, గ్రామస్థులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. స్థానికులు ఆయన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

March 17, 2026 / 02:00 PM IST

‘ఆస్తి పన్ను వడ్డీలు 50% రాయితీని సద్వినియోగం చేసుకోవాలి’

ATP: రాయదుర్గం మున్సిపాలిటీలో పెండింగ్లో ఉన్న ఆస్తి, కొళాయి పన్ను బకాయిలను చెల్లించాలని కమిషనర్ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లిస్తే వడ్డీలో 50% రాయితీ కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. కావున రాయదుర్గం మున్సిపాలిటీ ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడాలన్నారు.

March 17, 2026 / 02:00 PM IST

మౌలిక సదుపాయాలపై ఆరా..

VSP: చింతల్లోవ, కాకరలోవ, జయేంద్ర కాలనీ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను జీవీఎంసీ జోనల్ కమిషనర్ హేమవతి పరిశీలించారు. కార్పొరేటర్ గల్లా చిన్నతో కలిసి మౌలిక సదుపాయాల గురించి స్థానికులతో మాట్లాడారు. పనుల పురోగతిని సమీక్షించారు. సచివాలయ, శానిటేషన్ సిబ్బంది ఆమె వెంట ఉన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆమె సిబ్బందికి సూచించారు.

March 17, 2026 / 01:46 PM IST

ఈ నెలాఖరులోగా నిర్దేశించిన లక్ష్యం పూర్తి

AKP: కోటవురట్ల మండలంలో ఈ నెలాఖరు నాటికి 5.73 లక్షల పని దినాలు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించినట్లు ఉపాధి హామీ పథకం ఏపీవో నాగరాజు మంగళవారం తెలిపారు. ఇప్పటివరకు 5.53 లక్షల పని దినాలను పూర్తి చేశామన్నారు. ఈ నెలాఖరులోగా 20వేల పని దినాలను పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం రోజుకు మూడు వేల మంది కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.

March 17, 2026 / 01:43 PM IST

హంద్రీనీవా ద్వారా పెద్ద చెరువుకు చేరుతున్న కృష్ణా జలాలు

CTR: పుంగనూరు (M) మోదుగులపల్లి పెద్ద చెరువుకు హంద్రీనీవా ద్వారా కృష్ణ జనాలను విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాధవ రెడ్డి పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలతో కలిసి కృష్ణా జలాలకు పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు. ఈ చెరువు ఆయకట్టు కింద అనుకుని ఉన్న భూమి రైతులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

March 17, 2026 / 01:36 PM IST

రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత

E.G: తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో రైతన్నా-మీకోసం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఉందని, తద్వారా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

March 17, 2026 / 01:33 PM IST

రేణిగుంటలో మోసం చేసి దోపిడీ

TPT: రేణిగుంటలో ఆలయానికి తీసుకెళ్తామని నమ్మించి ఓ వ్యక్తిని మోసం చేసి దోపిడీ చేసిన ఘటన బయటపడింది. కడప జిల్లా రాజంపేటకు చెందిన వ్యక్తితో పరిచయం పెంచుకున్న ఇద్దరు, అతన్ని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించి బైక్, మొబైల్, నగదు, వెండి గొలుసు దోచుకుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

March 17, 2026 / 01:33 PM IST

ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడి..!

KDP: బద్వేల్ మండల పరిధిలోని లక్ష్మీపాలెం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి జరిగింది. బస్సు ఆపి ఓ వ్యక్తి డ్రైవర్‌పై దాడి చేయడంతో ముక్కులో నుంచి రక్తం వస్తున్న డ్రైవర్‌ను వదలలేదని స్థానికులు తెలిపారు. అయితే దాడి నిన్న జరిగిన ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు డ్రైవర్ తెలిపాడు.

March 17, 2026 / 01:29 PM IST

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి..!

KDP: బద్వేల్ మండల పరిధిలోని లక్ష్మీపాలెం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి జరిగింది. బస్సు ఆపి ఓ వ్యక్తి డ్రైవర్‌పై దాడి చేయడంతో ముక్కులో నుంచి రక్తం వస్తున్న డ్రైవర్‌ను వదలలేదని స్థానికులు తెలిపారు. అయితే దాడి నిన్న జరిగిన ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు డ్రైవర్ తెలిపాడు.

March 17, 2026 / 01:29 PM IST

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి..!

KDP: బద్వేల్ మండల పరిధిలోని లక్ష్మీపాలెం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి జరిగింది. బస్సు ఆపి ఓ వ్యక్తి డ్రైవర్‌పై దాడి చేయడంతో ముక్కులో నుంచి రక్తం వస్తున్న డ్రైవర్‌ను వదలలేదని స్థానికులు తెలిపారు. అయితే దాడి నిన్న జరిగిన ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు డ్రైవర్ తెలిపాడు.

March 17, 2026 / 01:29 PM IST

సజ్జల నూర్పిడి యంత్రంలో పడి వ్యక్తి దుర్మరణం

KRNL: పెద్దకడబూరు మండలం నౌలేకల్ గ్రామ శివారులో మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులోని ఓ రైతు పొలంలో సజ్జలు నూర్పిడి పట్టే యంత్రంలో ప్రమాదవశాత్తు దొడ్డనగేరి గ్రామానికి చెందిన వ్యక్తి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. యంత్రంలో చిక్కుకోవడంతో మృతుడి శరీరం గుర్తుపట్టలేనంతగా చిద్రమైనట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 17, 2026 / 01:29 PM IST