• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కలెక్టరేట్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

VSP: కలెక్టరేట్ ప్రాంగణంలో ఏపీ జేఏసీ, ఏపీఆర్ఎస్ఏ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరీంధర్ ప్రసాద్ మాట్లాడుతూ.. సృష్టిలో మహిళ పాత్ర ఉన్నతమైనదని కొనియాడారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు మహిళలు తమ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు.

March 8, 2026 / 06:03 AM IST

నేడు జిల్లాకు రానున్న రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్

CTR: రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయప్రతాప్ రెడ్డి ఇవాళ జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు జిల్లాలో పర్యటిస్తారన్నారు. ఈ పర్యటనలో ఛైర్మన్ జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును ప్రత్యక్షంగా పరిశీలించనున్నట్లు తెలిపారు. పాఠశాలలోని విద్యార్థుల భోజన నాణ్యతను పరిశీలిస్తారు.

March 8, 2026 / 06:02 AM IST

సమాజంలో మహిళల పాత్ర వెలకట్టలేనిది: జేసీ

SKLM: సమాజ గమనంలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని జిల్లా జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమానికి జేసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా సాధికారత కేవలం ఒక రోజు వేడుకలకు మాత్రమే పరిమితం కాకూడదని, వారి హక్కులు, రక్షణ పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు

March 8, 2026 / 06:02 AM IST

అంగరంగ వైభవంగా శ్రీవారి తెప్పోత్సవం

NLR: బోగోలు మండలం కొండబిట్రగుంటలో శ్రీప్రసన్న వెంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నూతనంగా నిర్మించిన కోనేరులో తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన తెప్పపై కోనేరులో స్వామివారిని ఊరేగిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు.

March 8, 2026 / 05:44 AM IST

‘సెలవు రోజుల్లోనూ ఆస్తి పన్నులు చెల్లించవచ్చు’

E.G: రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో ఆదివారం కూడా ఆస్తి, ఖాళీ స్థలం, నీటి పన్నులు చెల్లించేందుకు కౌంటర్లు అందుబాటులో ఉంటాయని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. ట్రెజరీతో పాటు ఆన్‌లైన్ లేదా సమీప సచివాలయాల్లో చెక్కుల ద్వారా కూడా పన్నులు చెల్లించవచ్చని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

March 8, 2026 / 05:30 AM IST

దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంపై కలెక్టర్ అసహనం

సత్యసాయి జిల్లాలో 22-A నిషేధిత భూముల జాబితా శుద్ధి, డాటెడ్ లాండ్స్ అభ్యర్థనలపై కలెక్టర్ శ్యాంప్రసాద్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో 22-A మార్పుల కోసం 453, డాటెడ్ లాండ్స్ క్లెయిమ్స్ కోసం 281 దరఖాస్తులు అందాయని వెల్లడించారు. వీటిలో మెజారిటీ దరఖాస్తులు గడువు దాటి పెండింగ్‌లో ఉండటంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.

March 8, 2026 / 05:30 AM IST

కుమారుడి కుల ధ్రువీకరణ పత్రం కోసం తల్లి పోరాటం

KKD: తన కుమారుడికి కుల ధ్రువీకరణ పత్రం కోసం కాళ్లు అరిగేలా తిరిగి అలసిపోయానంటూ మహిళ పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ముందు అర్ధరాత్రి బైఠాయించారు. పట్టణానికి చెందిన పొట్నూరి దుర్గమ్మ కుమారుడుకి రేపటితో నీట్ దరఖాస్తుకి లాస్ట్ తేదీ అని తెలిపిన జిల్లా అధికారులు.. తన కుమారుడికి కుల దృవీకరణ పత్రం ఇవ్వడం లేదంటూ నిరసన తెలిపారు.

March 8, 2026 / 05:30 AM IST

నేరాల నియంత్రణపై డీఎస్పీ విజయ్ కుమార్ సమీక్ష

ATP: డీఎస్పీ విజయ్ కుమార్ శనివారం అమడగూరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టు, దర్యాప్తు పురోగతిపై అధికారులతో చర్చించారు. అనంతరం నల్లమడ, ఓడీసీ, అమడగూరు స్టేషన్ల కోర్టు కానిస్టేబుళ్లతో సమావేశమై లోక్ అదాలత్ కేసుల స్థితిగతులపై ఆరా తీశారు.

March 8, 2026 / 05:30 AM IST

లక్కీరెడ్డిపల్లిలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

అన్నమయ్య: లక్కీరెడ్డిపల్లిలో ఆదివారం ఉదయం 6.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. 132 కేవీ సురకవాండ్లపల్లి సబ్‌స్టేషన్‌లో బ్రేకర్ మార్పిడి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.

March 7, 2026 / 10:35 PM IST

తాడేపల్లిగూడెంలో న్యాయ విజ్ఞాన సదస్సు

W.G: మహిళలు చట్టాలను న్యాయబద్ధంగా వినియోగించుకోవాలని జడ్జిలు కే. మాధవి, ఎస్. సూర్య కిరణ్ సూచించారు. శనివారం తాడేపల్లిగూడెం మండల పరిషత్ సమావేశ మందిరంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సమాజంలో మహిళల పాత్ర కీలకమని, వారికి అనేక చట్టాలు ఉన్నాయన్నారు. వాటిని సక్రమంగా వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజరాజేశ్వరి, ఎండీవో వీ.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

March 7, 2026 / 09:51 PM IST

మహిళలకు ఎస్పీ శుభాకాంక్షలు.!

KDP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని మహిళలందరికీ కడప జిల్లా ఎస్పీ విశ్వనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు దేశ నిర్మాణం, జాతీయ సమగ్రత, శాంతి సామరస్యాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. సమాజం, కుటుంబ వ్యవస్థలో మహిళలు బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు.

March 7, 2026 / 09:45 PM IST

అంబాజీపేట బీజేపీ మండల అధ్యక్షుడుగా ఆంజనేయులు

కోనసీమ: అంబాజీపేట మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా కురసా ఆంజనేయులు ఎన్నికయ్యారు. ఈ మేరకు పుల్లేటికుర్రు గ్రామంలో శనివారం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ, ఎన్నికల పరిశీలకులుగా మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ పాల్గొని అతనిని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఆంజనేయులను పలువు నాయకులు ఘనంగా సత్కరించారు.

March 7, 2026 / 09:35 PM IST

బీజేపీకి వాళ్లు బానిసలుగా మారారు: షర్మిల

ELR: రాష్ట్రంలో జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు బీజేపీకి బానిసలుగా, బినామీలుగా మారారు అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. చింతలపూడి మండలం ఎర్రంపల్లిలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. వీళ్లల్లో ఒక్క నాయకుడు కూడా ప్రత్యేక హోదా కావాలని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని, అమరావతిని నిర్మించాలని కోరలేదని ఎద్దేవ చేశారు.

March 7, 2026 / 09:32 PM IST

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే

అన్నమయ్య: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ ప్రభుత్వం మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి వారి అభ్యున్నతికి కృషి చేసిందన్నారు. రాయచోటి నియోజకవర్గంలో మహిళా మార్ట్, గృహాల పట్టాలు, విద్యా సౌకర్యాల ద్వారా మహిళలకు ప్రోత్సాహం అందించినట్లు తెలిపారు.

March 7, 2026 / 09:27 PM IST

అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించిన ప్రజాప్రతినిధులు

NLR: కలువాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆర్ లక్ష్మీదేవి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు అన్ని శాఖల అధికారులు పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. గ్రామాలలోని పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు.

March 7, 2026 / 09:20 PM IST