సత్యసాయి జిల్లాలో 22-A నిషేధిత భూముల జాబితా శుద్ధి, డాటెడ్ లాండ్స్ అభ్యర్థనలపై కలెక్టర్ శ్యాంప్రసాద్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో 22-A మార్పుల కోసం 453, డాటెడ్ లాండ్స్ క్లెయిమ్స్ కోసం 281 దరఖాస్తులు అందాయని వెల్లడించారు. వీటిలో మెజారిటీ దరఖాస్తులు గడువు దాటి పెండింగ్లో ఉండటంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.