GNTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా కలెక్టర్ కార్యాలయంలో పోస్టర్లను విడుదల చేశారు. ఇందులో భాగంగా పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
AKP: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సమయం 17 రోజులే ఉందని డీఈవో అప్పారావు నాయుడు అన్నారు. ప్రతి ఆదివారం నిర్వహించే డయల్ యువర్ టీచర్ ప్రోగ్రాం ప్రతిరోజు చేయడానికి సంబంధిత సబ్జెక్ట్ టీచర్స్ ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు రాత్రి ఆరు గంటల నుంచి 9 గంటల వరకు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండి ఫోన్ ద్వారా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తారన్నారు.
VSP: సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు ఆర్.నల్లకన్ను మరణంపై సీపీఐ జిల్లా సమితి సంతాపం వ్యక్తం చేసింది. జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్ మాట్లాడుతూ.. 1925 డిసెంబర్ 26న జన్మించిన నల్లకన్ను స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారని తెలిపారు. బడుగు బలహీనుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ఆయన నిజాయితీకి ప్రతీకగా నిలిచారని కొనియాడారు.
AKP: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా పకడ్బందీగా జరుగుతున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి ఎం వినోద్ బాబు తెలిపారు. గురువారం జరిగిన సెకండ్ ఇయర్ పరీక్షకు 217 విద్యార్థులు గైర్హాజరు అయినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 34 పరీక్షా కేంద్రాల్లో 12,390 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 12,173 మంది హాజరైనట్లు తెలిపారు.
SKLM: దైవచింతన, సేవాభావం రెండు సమాజానికి అవసరమని పలాస నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరి అన్నారు. గురువారం పలాసలో శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
NLR: గురుకులాల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మార్చి 2న ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే పరీక్షను అదే నెల 8వ తేదీకి వాయిదా వేసినట్లు ఆ సంస్థ నెల్లూరు జిల్లా సమన్వయకర్త ప్రభావతమ్మ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 9వ తరగతి విద్యార్థులకు ఎస్ఏ 2 పరీక్షలను నిర్వహిస్తున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
VZM: గజపతినగరంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం మాజీ మంత్రి పడాల అరుణ ఆధ్వర్యంలో జరిగింది. సభ్యత్వంతో జనసేన కుటుంబాలకు అండగా ఉంటూ బీమా చెల్లించడం జరుగుతుందన్నారు. ఇందులో నియోజకవర్గ ఇంఛార్జ్ మర్రపు సురేష్, మండల పార్టీ అధ్యక్షులు మునకాల జగన్నాధరావు, నీటి సంఘం నాయకులు తాళ్లపూడి సౌమిత్రి త్రివేది, కృష్ణ పాల్గొన్నారు.
W.G: పెనుమంట్ర(మం) బ్రాహ్మణచెరువులో గురువారం ఏఎన్ఎం లక్ష్మి, ఆశా కార్యకర్తలు ముమ్మరంగా NCD సర్వే నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ.. గ్రామస్థులకు బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల పరీక్షలు నిర్వహించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు.
E.G: ఏపీ విద్యాశాఖ నిర్వహించిన APRCETలో కడియంకి చెందిన ఉపాధ్యాయుడు చిలుకూరి శ్రీనివాసరావు రాష్ట్ర వ్యాప్తంగా 14వ ర్యాంక్ సాధించాడు. రాష్ట్రంలో 17 విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పీహెచ్డీ సీట్లు భర్తీ చేసేందుకు 2025 నవంబర్‌లో APRCET పరీక్షలు జరిగాయి. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పరీక్షలు నిర్వహించి గురువారం ఫలితాలు వెల్లడించింది.
TPT: తిరుపతి విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితుల పోలీస్ కస్టడీ ముగిసింది. పీఆర్వో సతీష్, బౌన్సర్ల నుంచి పోలీసులు కీలక సమాచారం, కాల్ డేటా సేకరించారు. ఎవరి ఆదేశాల మేరకు కిడ్నాప్ జరిగిందనే కోణంలో విచారణ సాగింది. నోటీసులు ఇచ్చినా మంచు విష్ణు ఇంకా విచారణకు రాలేదు. మోహన్ బాబు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ మార్చి 3కి వాయిదా పడటంతో ఉత్కంఠ నెలకొంది.
CTR: సోమల ఏఎంసీ ఛైర్మన్ శ్రీనివాసులు నాయుడు అమరావతిలో పలువురు మంత్రులను కలిశారు. హోం మంత్రి అనిత, రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్‌ను కలిసి మండలంలో నెలకొన్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. భూ వివాదాలు, భద్రతా సంబంధిత అంశాలను వారి దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. వీటిపై చర్యలు తీసుకోవాలని మంత్రులను కోరారు.
PPM: జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణను గురువారం జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు ఆమె స్థానిక ఆర్.కె.జూనియర్ కళాశాల, పి.ఎస్.ఎం.వాసవి జూనియర్ కళాశాలలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను సందర్శించారు. పరీక్షల సరళిని, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.
ATP: విడపనకల్లు మండలం డొనేకల్ శివారులో గురువారం ఉదయం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అతడిని రాళ్లతో కొట్టి చంపినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
BPT: ప్రజారక్షణే లక్ష్యంగా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ప్రశంసించారు. అసెంబ్లీలో ఏపీలో ‘నో హెల్మెట్–నో ఫ్యూయల్’ అమలు చేయాలని ప్రతిపాదించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. హెల్మెట్ లేక ఇంధనం ఇస్తే ప్రమాదాలు పెరుగుతాయని తెలిపారు.
KRNL: విజయవాడలో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడును ఆలూరు టీడీపీ ఇంఛార్జి వైకుంఠం జ్యోతి మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. ఈ సమావేశంలో ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ సంస్థాగత బలోపేతంపై ఇంఛార్జి చర్చించారు. ఈ భేటీ నియోజకవర్గ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించింది.