21 మందితో కూడిన నియోజకవర్గాల మూడో జాబితాను ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ విడుదల చేశారు. అలాగే పార్లమెంట్ పరిధిలోని ఇంచార్జులను కూడా ప్రకటించారు.
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయ్యిందని.. జగన్‌ను గద్దె దింపేందుకు దళితులంతా సిద్ధంగా ఉన్నారని మాజీ ఎంపీ జీవీ హర్షకుమర్ అన్నారు. ఈక్రమంలో షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఇవ్వద్దని వ్యాఖ్యనించారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసీ ఆ పత్రాన్ని స్పీకర్‌కు పంపించారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. మూడు కేసుల్లో ఏపీ హై కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం హీట్ ఎక్కుతోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో భారత క్రికెటర్ అంబటి రాయుడు భేటీ అయ్యారు. గంట నుంచి సుధీర్ఘ చర్చలు సాగుతున్నాయి.
విజయవాడలోని నోవాటెల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమీక్షకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. సీఈసీ రాజీవ్‌కుమార్‌ను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న ఓటరు జాబితాలో అక్రమాలపై ఫిర్యాదు చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రా ముఖ్యమంత్రులను పట్టించుకునేంత టైం తమకు లేదన్నారు.
వైసీపీ అధినాయకత్వం సీరియస్ నిర్ణయం తీసుకుంది. గీత దాటిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ , మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసింది. నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై పార్టీ అధిష్టానం అనర్హత వేటు వేసింది.
భారత క్రికెటర్ అంబటి రాయుడిని సీఎం జగన్ స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. కండువ కప్పుకొని రెండు వారాలు కాకుండానే అనుహ్యంగా పార్టీకి రాజీనామా చేశారు రాయుడు. దీంతో ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. గుంటూరు ఎంపీ టికెట్ ఇవ్వకపోవడమే ఆయన పార్డీ వీడడానికి కారణం అని సర్వత్రా పుకార్లు వినిపిస్తున్నాయి. వాటికి చెక్ పెడుతూ తాజాగా అంబటి రాయుడు ఓ ట్వీట్ చేశాడు.
తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సు నెల్లూరు జిల్లాలో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
తనకంటే గొప్ప వ్యక్తులు చాలా మంది ఉన్నారని, అనేక రంగాల్లో రాణించిన చాలా మందిని వదిలిపెట్టి తనకు డాక్టరేట్ ఇవ్వడంపై పవర్ స్పందించారు. గౌరవంగానే తాను ఆ డాక్టరేట్ ను తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు.
సరిగ్గా మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. వైసీపీ ఇప్పటికే రెండు దశల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పుడు అందరి దృష్టి టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితాపైనే ఉంది.
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పార్టీని విలీనం చేసి కాంగ్రెస్‌లో చేరడంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిల చేరడం వెనుక కుట్ర ఉందని సజ్జల ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. వైసీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు మారుతున్నారు. అయితే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా పార్టీ మారుతున్నట్లు ప్రచారం సాగింది.
గత 26 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించింది. సమ్మెను నిషేధిస్తున్నట్లు తెలిపింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకి తీసుకొస్తూ జీవో నెంబర్ 2 విడుదల చేసింది.