»Tdp And Janasena Mla Candidates List Will Be Released On Jan 3rd Week
AP Elections : జనవరి మూడో వారంలో టీడీపీ జనసేన అభ్యర్థుల మొదటి జాబితా విడుదల
సరిగ్గా మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. వైసీపీ ఇప్పటికే రెండు దశల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పుడు అందరి దృష్టి టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితాపైనే ఉంది.
Pawan kalyan meeting with Chandrababu at hyderabad these topics discuss
AP Elections : సరిగ్గా మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. వైసీపీ ఇప్పటికే రెండు దశల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పుడు అందరి దృష్టి టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితాపైనే ఉంది. టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితా కోసం ఇరు పార్టీల అభిమానులు, క్యాడర్‌తో పాటు వైసీపీ క్యాడర్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సంక్రాంతి పండుగ నాడు అభ్యర్థుల జాబితా వెలువడుతుందని నాదెండ్ల మనోహర్ పలు సందర్భాల్లో చెప్పారు. ఇక మూడో వారంలో కచ్చితంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేయబోతున్నారని టీడీపీ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో జనవరి 12 లేదా 13న విడుదలయ్యే అవకాశం ఉంది.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
అలాగే టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి దశ జాబితాను జనవరి 16న విడుదల చేయనున్నట్లు సమాచారం.ఈ జాబితాలో టీడీపీ నుంచి 60 మంది అభ్యర్థులు, జనసేన నుంచి 23 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. జనసేన పార్టీ టీడీపీని 70 సీట్లు డిమాండ్ చేయగా చివరకు 50 సీట్లకు ఒప్పందం కుదిరినట్లు అందుతున్న సమాచారం. మూడు విడతలుగా జాబితా విడుదల కానుంది. జనసేన అభ్యర్థుల జాబితా కూడా మూడు దశల్లో రానుంది. అభ్యర్థుల జాబితా వెలువడగానే పవన్ కళ్యాణ్ తన వారాహి విజయ యాత్రను ప్రారంభిస్తారని అంటున్నారు.