YCP : నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై వైసీపీ అనర్హత వేటు
వైసీపీ అధినాయకత్వం సీరియస్ నిర్ణయం తీసుకుంది. గీత దాటిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ , మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసింది. నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై పార్టీ అధిష్టానం అనర్హత వేటు వేసింది.
YCP : వైసీపీ అధినాయకత్వం సీరియస్ నిర్ణయం తీసుకుంది. గీత దాటిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ , మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసింది. నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై పార్టీ అధిష్టానం అనర్హత వేటు వేసింది. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేసింది. పార్టీ లైన్ దాటి పనిచేశారంటూ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఆధారాలను కూడా సమర్పించింది. పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయాలని చీఫ్‌విప్ ప్రసాద్‌రాజు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌లకు ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉండగా.. ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఇటీవల జనసేనలో చేరగా.. సి.రామచంద్రయ్య టీడీపీలో చేరారు. మరోవైపు గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ లైన్ క్రాస్ చేశారు. అయితే వైసీపీ అధిష్టానం ఈ నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తాజాగా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల కసరత్తు జరుగుతుండగా.. ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేయగా స్పీకర్, మండలి ఛైర్మన్ నిర్ణయంపై ఆధారపడి ఉంది.