పీలేరులో టీడీపీ రా.. కదలిరా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజాకోర్టులో వైసీపీని శిక్షించే సమయం దగ్గరపడిందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే జగన్ ప్రజల్లోకి వస్తారని విమర్శించారు.
ప్రాజెక్ట్ పనులు వదిలేసి సంక్రాంతి పండుగకి డ్యాన్స్‌లు చేస్తున్నారంటూ నీటిపారుదల మంత్రి అంబటి రాంబాబుపై ఏపీసీసీ వైఎస్ షర్మిల విమర్శించారు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు.
ఏపీకి షర్మిల ఏం మొహం పెట్టుకుని వచ్చిందని మంత్రి రోజా ప్రశ్నించారు. తెలంగాణలో ఛీ కొడితే ఏపీకి వచ్చి చేరిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి కూడా ప్రజలు జగనన్న ప్రభుత్వానికే పట్టం కడుతారన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో జనసేన రెండు స్థానాల నుంచి పోటీ చేస్తుంది.
టీడీపీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని తమ అభ్యర్థులను ప్రకటించిందని, అందుకే తాము రెండు స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించినట్లు జనసేన చీఫ్ పవన్ అన్నారు. టీడీపీ పొత్తు ధర్మం పాటించలేదని, అయినప్పటికీ భవిష్యత్తులోనూ ఆ పార్టీతో పొత్తు కొనసాగుతుందని పవన్ స్పష్టం చేశారు.
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నుంచి 50 మంది ఎమ్మెల్యేలు టీడీపీ, జనసేన పార్టీల్లోకి వెళ్లనున్నారని, త్వరలోనే ఆ పని జరుగుతుందని ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. వైసీపీ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల సంఘం జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసైనికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈసీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
ఏపీని విభజించినట్లే తమ కుటుంబాన్ని కూడా విభజించేందుకు కాంగ్రెస్ చూస్తోందని, ఆ పార్టీ ఎప్పుడూ థర్డ్ గేమ్ ఆడుతుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. మరోసారి తమను ప్రజలే గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఏ మంచి చేయకపోయినా ఆయన్ను మోసే స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని సీఎం జగన్ ఎద్దేవ చేశారు. దత్తపుత్రుడితో సహా పలు మీడియా సంస్థలు ఆయనకు అండగా ఉన్నాయన్నారు.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనడం కొంతమంది వైసీపీ నేతలకు నచ్చడం లేదని ఇకపై జగనన్న గారు అనే పిలుస్తా అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఏపీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాత జిల్లాల పర్యటనలో భాగంగా ఈ రోజు పలాస నియోజకవర్గంలో బస్సు ప్రయాణం చేశారు.
అయోధ్య రామమందిరంలో బాలరాముడు కొలువు దీరాడు. ఈరోజు నుంచి భక్తులకు బాలరాముడు దర్శనమివ్వనున్నాడు. ఈక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు వెళ్లడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. రామభక్తులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ఈరోజు విడుదల చేసింది. నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈక్రమంలో ఆమె వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేయడంతో మాజీ పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, మంత్రి ఉషాశ్రీ చరణ్ షర్మిల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఎసైన్‌మెంట్ చట్టం -1977లో పలు సవరణలు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ నిన్న నోటిఫికేషన్ జారీ చేశారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు.