Janasena: టీడీపీ పొత్తు ధర్మం పాటించలేదు..పవన్ కీలక ప్రకటన
టీడీపీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని తమ అభ్యర్థులను ప్రకటించిందని, అందుకే తాము రెండు స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించినట్లు జనసేన చీఫ్ పవన్ అన్నారు. టీడీపీ పొత్తు ధర్మం పాటించలేదని, అయినప్పటికీ భవిష్యత్తులోనూ ఆ పార్టీతో పొత్తు కొనసాగుతుందని పవన్ స్పష్టం చేశారు.
Janasena president Pawan Kalyan made key comments in Mangalagiri meeting
టీడీపీ, జనసేన పొత్తుపై జనసేన అధినేత పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మండపేటలో టీడీపీ అధినేత చంద్రబాబు తమ అభ్యర్థిని ప్రకటించడం పట్ల ఆయన మాట్లాడారు. పొత్తు ధర్మం ప్రకారంగా ఏకపక్షంగా అలా ప్రకటించకూడదని అన్నారు. తాము బలం ఇచ్చేవాళ్లం అవుతున్నాం కానీ తీసుకునేవాళ్లం అవలేకపోతున్నామన్నారు. ఇద్దరు వ్యక్తులను కలపడం కష్టమే అయినప్పటికీ విడదీయడం చాలా తేలిక అని అన్నారు.
తాము ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని స్థానాలు వస్తాయని, అయితే అధికారంలోకి వస్తామో లేదో తెలియదని పవన్ అన్నారు. రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. టీడీపీ రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిందని, అందుకే తాము కూడా రాజోలు, రాజానగరంలో పోటీ చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
రాజకీయాల్లో ఆటుపోట్లు ఎదురైనప్పటికీ ముందుకెళ్లాలని పవన్ తమ కార్యకర్తలకు, అభిమానులకు సూచించారు. టీడీపీతో పొత్తులో భాగంగా మూడోవంతు సీట్లు తీసుకుంటున్నట్లు చెప్పారు. భవిష్యత్తులోనూ టీడీపీతో పొత్తు కొనసాగుతుందని అన్నారు. లోకేం సీఎం పదవిపై మాట్లాడితే తానేమీ పట్టించుకోలేదని, ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను మౌనంగా ఉన్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.