YS Sharmila: ఏపీలో వైసీపీ ప్రభుత్వం గుండ్లకమ్మ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని ఏపీసీసీ వైఎస్ షర్మిల(YS Sharmila) ఆరోపించారు. రాజశేఖరరెడ్డి రూ. 750 కోట్లతో ప్రాజెక్టును నిర్మించి ప్రజలకోసం ఇచ్చారని, ఈ ప్రభుత్వం దీని మెయింటెనెన్స్ సరిగా చూసుకోవడం లేదని, ఏడాదికి కోటి రూపాయలు మంజూరు చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలతో కలిసి ప్రకాశం జిల్లా మద్దిపాడులో పర్యటించి గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ను పరీశిలించారు. కేవలం రూ. 10 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అన్నారు.
వైసీపీ ప్రభుత్వం కొత్తవి కట్టలేదు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్ట్‌లను కూడా కాపాడుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం స్పందించి మరమత్తు పనులు చేబట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు గేటు నీటిలో తేలుతోందని, ఇది చూసి వైసీపీ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలని షర్మిల ఆగ్రహించారు. ప్రజలకు సాగునీటిని అందించే నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతికి డ్యాన్స్‌లు చేస్తారు కానీ పని చేయరు అని సెటైర్లు విసిరారు.