»Chandrababu Has Star Campaigners In The Next State Cm Jagan
CM Jagan: పక్క రాష్ట్రంలో చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు
చంద్రబాబు ఏ మంచి చేయకపోయినా ఆయన్ను మోసే స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని సీఎం జగన్ ఎద్దేవ చేశారు. దత్తపుత్రుడితో సహా పలు మీడియా సంస్థలు ఆయనకు అండగా ఉన్నాయన్నారు.
Chandrababu has star campaigners in the next state CM Jagan
CM Jagan: టీడీపీ నేత చంద్రబాబుకు చాలా మంది భజన పరులు స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారని ఏపీ సీఎం జగన్(YS Jagna) మండిపడ్డారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ ఆసరానిధుల జమ కార్యక్రమంలో జగన్ పాల్గొని మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఏనాడూ ఒక్క మంచి పని కూడా చేయలేదని సీఎం జగన్ విమర్శించారు. అధికారికంగా పక్కరాష్ట్రంలో ఉండే ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఓ స్టార్ క్యాంపెయినర్ అని, అలాగే ఎప్పుడే పక్క రాష్ట్రంలోనే ఉండే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 మీడియా అధిపతులు బాబుకు స్టార్ క్యాంపెయినర్ అని ఎద్దేవ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఎంత మంచి చేసినా ఏ అభివృద్ధి చేయాలేదని చూపించడమే ఈ మీడియా పని అన్నారు.
దత్తపుత్రుడు ఒక స్టార్ క్యాంపెయినర్ అయితే, ఆయన వదిన (పురందేశ్వరి) మరో స్టార్ క్యాంపెయినర్ అని విమర్శించారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి వెళ్లిన చంద్రబాబు అభిమానులు కూడా ఆయన స్టార్ క్యాంపెయినరే అని పేర్కొన్నారు. పసుపు, కమలాల మనుషులందరూ ఆయకు పనిచేస్తున్నారని, వీరిలో కొందరు వేదికలపై కనిపిస్తే, మరికొందరు టీవీల్లో కనిపిస్తారని పేర్కొన్నారు. తమకు ఒక్క స్టార్ క్యాంపెయినర్ లేరని, వైసీపీ ప్రభుత్వంలో మంచి జరిగిన ప్రతి గడపలోని అక్కాచెల్లెమ్మలే తమకు స్టార్ క్యాంపెయినర్లు అని అన్నారు.