Kodali Nani: తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాక తనకు కనీసం ఫోన్ చేయలేదని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని స్పందించారు. రేవంత్ రెడ్డి సీఎంగా గెలిచినప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారని నాని వ్యాఖ్యనించారు. రేవంత్ రెడ్డి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను పట్టించుకునేంత టైం తమకు లేదని.. కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పడానికి తాము కాంగ్రెస్ పార్టీలో లేమని.. రేవంత్‌కు ఎందుకు ఫోన్ చేయాలని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తుంటి ఎముక విరిగింది కాబట్టి ఆయనను సీఎం జగన్ పరామర్శించారు. రేవంత్ రెడ్డికి ఏమైనా తుంటి ఎముక విరిగిందా వెళ్లి కలవడానికి అంటూ సెటైర్ వేశారు. రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కావాలంటే డైరక్ట్‌గా సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలుస్తామని అప్పుడు ఆయనే తమకు అపాయింట్మెంట్ ఇస్తారని వ్యాఖ్యానించారు.