»Harsha Kumar Dont Give Ap Congress Responsibilities To Sharmila
Harsha Kumar: షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఇవ్వద్దు
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయ్యిందని.. జగన్ను గద్దె దింపేందుకు దళితులంతా సిద్ధంగా ఉన్నారని మాజీ ఎంపీ జీవీ హర్షకుమర్ అన్నారు. ఈక్రమంలో షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఇవ్వద్దని వ్యాఖ్యనించారు.
Harsha Kumar: వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయ్యిందని.. జగన్ను గద్దె దింపేందుకు దళితులంతా సిద్ధంగా ఉన్నారని మాజీ ఎంపీ జీవీ హర్షకుమర్ అన్నారు. వైసీపీ పాలనలో ఎస్సీలపై దాడులు అధికంగా ఉన్నాయని మాజీ ఎంపీ ఆరోపించారు. జగన్ పరిపాలనతో దళితులు నిరాదరణకు గురయ్యారు. ఫిబ్రవరి 8న విశాఖలో దళిత గర్జన నిర్వహించనున్నట్లు తెలిపారు.
జగన్ పాలనలో ఎస్సీలపై అనేక దాడులు జరిగాయి. ఒక్క కేసులో కూడా న్యాయం జరగలేదన్నారు. సామాజిక సాధికార యాత్ర పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు. దళితుల ఆశలపై జగన్ నీళ్లు చల్లారు. సొంత మనుషులకు వేలాది ఎకరాలను ధారాదత్తం చేస్తున్నారని హర్ష కుమార్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తాను అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని హర్షకుమార్ స్పష్టం చేశారు. అలాగే తెలంగాణకు చెందిన షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఇవ్వద్దని హర్షకుమార్ వ్యాఖ్యనించారు.