తనను ప్రేమించాలంటూ ఓ యువతిని వేదించ సాగాడో యువకుడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో కత్తితో గొంతు కోసి చంపేశాడు. తర్వాత పొడుచుకుని అతడూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. ఇప్పుడు ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు.
కాణిపాకం హుండీ లెక్కింపులో స్థానిక బ్యాంకు అధికారి తన తెలివిని ప్రదర్శించాడు. ఓ బంగారు బిస్కెట్‌ను తన సంచిలో వేసుకున్నాడు. గమనించిన ఆలయ ఈవో ప్రశ్నించగా బుకాయించాడు. ఆ తరువాత ఏమైందంటే..
ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఏ1గా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్‌లో పిన్నెల్లి కారును గుర్తించిన పోలీసులు నరసరావుపేట కోర్టు వద్ద కాపలా కాస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న తప్పులను ఎత్తి చూపించినందుకు తనను జైల్లోనే చంపేయాలని ప్రయత్నించారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంపై ఇంకా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయ్యాయి. జూన్ 4వ తేదీన వీటి ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఇదిలా ఉండగా ఏపీ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నో రోజులుగా కడుపు నొప్పితో బాధ పడుతున్న మహిళ చివరికి ఆసుపత్రికి వెళ్లింది. డాక్టర్లు స్కానింగ్ చేసి చూడగా గాల్ బ్లాడర్‌లో పెద్ద ఎత్తున రాళ్లు ఉండటాన్ని గుర్తించారు. తర్వాత ఏమైందంటే..?
ఏపీ, తెలంగాణలో మే 23 వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని తెలిపింది.
తిరుమల ఎప్పుడు భక్తజనంతో కలకలలాడుతూనే ఉంటుంది. అయితే వేసవి సెలవులు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. తిరుపతి కొండపై ఎటు చూసిన భక్త జనం కనిపిస్తున్నారు. టోకెన్లు లేని భక్తులు దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది.
స్టేషన్‌లోనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పోలింగ్ సమయంలో ఏపీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్ధి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాలను ఎన్నికల సంఘం ఆదేశించింది.