»Tirumala Crowd Of Devotees To Tirumala 24 Hours Time For Sarvadarshan
Tirumala: తిరుమలకు భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం
తిరుమల ఎప్పుడు భక్తజనంతో కలకలలాడుతూనే ఉంటుంది. అయితే వేసవి సెలవులు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. తిరుపతి కొండపై ఎటు చూసిన భక్త జనం కనిపిస్తున్నారు. టోకెన్లు లేని భక్తులు దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది.
Tirumala: Crowd of devotees to Tirumala.. 24 hours time for Sarvadarshan
Tirumala: తిరుమల కొండకు ఏడాది అంతా భక్తుల వెళ్తూనే ఉంటారు. భక్తజనంతో తిరుమల ఎప్పుడు కలకలలాడుతూనే ఉంటుంది. అయితే వేసవి సెలవులు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. తిరుపతి కొండపై ఎటు చూసిన భక్త జనం కనిపిస్తున్నారు. ఈ రద్దీ వల్ల సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం వేచి ఉండాల్సి వస్తుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్ట్మెట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లూ భక్తులతో నిండిపోయాయి.
క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అన్ని సదుపాయాలను అందిస్తోంది. అల్పహారం, తాగునీరు, మధ్యాహ్న భోజనం కూడా అందిస్తోంది. నిన్న భారీ వర్షం కురవడంతో శ్రీవారి ఆలయ ప్రాంగణం మొత్తం తడిసింది. రెండు గంటలు భారీ వర్షానికి భక్తులు ఎక్కడికి వెళ్లకుండా అదే ప్లేస్లో ఉండిపోయారు. ఆ తర్వాత లడ్డూ విక్రయ కేంద్రాల వద్ద పెద్ద క్యూలైన్లో భక్తులు కనిపించారు.