నిన్న మొన్నటి వరకు అమెరికా టూర్ ఎంజాయ్ చేసి.. హైదరాబాద్‌లో ల్యాండ్ అయిపోయాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇండియన్ క్రికెట్ టీమ్ తో సందడి చేసి.. ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చాడు. ఇప్పుడు ఎన్టీఆర్ 30 కోసం రెడీ అవుతున్నాడు. సినిమా సినిమాకు చేంజ్ ఓవర్ చూపించే ఎన్టీఆర్.. కొరటాల సినిమా ఎన్టీఆర్30లో సరికొత్తగా కనిపించబోతున్నాడు. ప్రజెంట్ తారక్ కనిపిస్తున్న లుక్ అదే అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అయితే చాలా రోజులుగా ఎన్టీఆర్ 30 డీలే అవుతూ వస్తోంది. తాజాగా ప్రాజెక్ట్ పట్టాలెక్కడంతో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారట. ఫిబ్రవరిలో రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుందట.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఫిబ్రవరి సెకండ్ వీక్ నుండి షూటింగ్ ప్రారంభించబోతున్నారట. హైదరాబాదు శివారులో వేసిన సెట్లో భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేయబోతున్నాడట కొరటాల. ప్రస్తుతం అందుకు రంగం సిద్దం చేస్తున్నాడట. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు కొరటాల. ఆచార్య ఫ్లాప్‌ని మరిపించేలా.. సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అందుకే ఎన్టీఆర్ 30 కోసం చాలా టైం తీసుకున్నాడు. ఇకపోతే.. ఎన్టీఆర్ 30 షూటింగ్ టైం దగ్గరికొచ్చినా.. హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.