గుంటూరు జిల్లా ఇప్పటంలో (Ippaṭan) హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇళ్ల కూల్చివేతపై జనసేన నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం నుంచి ఇప్పటం రామాలయం గర్భ గుడిలో ఉండి నిరసన తెలుపుతున్నారు జనసేన నేతలు. రామాలయం గర్భగుడిలోకి వెళ్లి తాళాలేసుకున్న జనసేన (Janasena) నేతలు బోనబోయిన, గాదె వెంకటేశ్వరరావు, చిల్లపల్లిని బయటకు తెచ్చేందుకు పోలీసులు (Police) నానా తంటాలు పడ్డారు.
గుంటూరు జిల్లా ఇప్పటంలో (Ippaṭan) హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇళ్ల కూల్చివేతపై జనసేన నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం నుంచి ఇప్పటం రామాలయం గర్భ గుడిలో ఉండి నిరసన తెలుపుతున్నారు జనసేన నేతలు. రామాలయం గర్భగుడిలోకి వెళ్లి తాళాలేసుకున్న జనసేన (Janasena) నేతలు బోనబోయిన, గాదె వెంకటేశ్వరరావు, చిల్లపల్లిని బయటకు తెచ్చేందుకు పోలీసులు (Police) నానా తంటాలు పడ్డారు. గుడి నుంచి జనసేన నేతలను వెలుపలకు తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు.ఇప్పటికే జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పటం గ్రామంలోకి వెళ్లే వారి ఐడీ కార్డులు చెక్ చేశారు పోలీసులు. కాసేపటి క్రితం ఇప్పటం రామాలయం నుంచి బయటకు వచ్చారు జనసేన నేతలు బోనబోయిన, గాదె వెంకటేశ్వరరావు, చిల్లపల్లి. ఇప్పటంలో కూల్చివేతల వద్దకు వెళ్ళారు జనసేన నేతలు.
ఇళ్ల కూల్చివేతలు జరపమని.. మున్సిపల్ అధికారులతో మాట్లాడిద్దామని పోలీసుల హామీతో జనసేన నేతలు వెనక్కి తగ్గారు. మున్సిపల్ అధికారుల కోసం ఎదురు చూస్తున్నారు జనసేన నేతలు.కూల్చివేతల ప్రాంతంలోనే జనసేన నేతల భైఠాయింపుతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి (Alla Ramakrishna Reddy)వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇళ్ల కూల్చివేత ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటంలో కూల్చివేతను జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ సభకు స్థలాన్ని ఇచ్చారనే వైసీపీ (YCP) సర్కార్ కక్ష గట్టి మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.