»Mla Kethi Reddy Who Says He Will Become Cm Next To Pawan Kalyan
Kethi Reddy: పవన్ కళ్యాణ్ పక్కా సీఎం అవుతాడు!
ఆంధ్రప్రదేశ్ కు సీఎం అయ్యే అవకాశాలు పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఉన్నాయి. ఏపీలో వాలంటరీ వ్యవస్థ చాలా ఉన్నతమైనది అంటున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.
MLA Kethireddy says that Pawan Kalyan will become CM for sure
Kethi Reddy: ఏలూరు వేదికగా జనసేనా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు గత రెండు రోజులుగా ఏపిలో ఏంతటి దూమారాన్ని రేపుతున్నాయో చూస్తూనే ఉన్నాము. తాజగా వీటిపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి (Kethi Reddy) వెంకాట్రామిరెడ్డి తనదైన రీతిలో స్పందించారు. ఆంధ్రప్రదేశ్ కు సీఎం అయే సత్తా ఉన్న రాజకీయనాయకుడు పవన్ కళ్యాణ్ అని అది ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు కచ్చితంగా పవన్ సీఎం అవుతారు అని అన్నారు. అయితే ఏలూరు సభలో పవన్ అదృష్యం అయిన 30 వేల మంది మహిళల గురించి మాట్లాడుతూ.. ఏపీలో గ్రామ వాలంటీర్ల వద్ద అందరి సమాచారం ఉంటుంది అని దాన్ని వారు తప్పుగా ఉపయోగిస్తూన్నారు అని మాట్లాడిన విషయం తెలిసిందే. దీనిపై కేతిరెడ్డి మాట్లాడుతూ.. అలా తప్పిపోయిన యవతిల గురించి వారి తల్లిదండ్రులు వచ్చి పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయమన్నారు. అంతే కానీ అర్థ పర్థం లేని మాటలు మాట్లాడితే పవన్ అనవసరంగా చులకన అవుతారని పేర్కొన్నారు. తాను చాలా సందర్భాల్లో కచ్చితంగా పవన్ కళ్యాణ్ కు మాత్రమే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి అని.. ఏపి ప్రజలు కూడా కొత్త న్యాయకత్వాన్ని కోరునేప్పుడు పవన్ కే మద్దతిస్తారని చెప్పారు. ఎందుకంటే అతను ఇప్పటి వరకు ప్రజాప్రనిధిగా పని చేయలేదని, ఆయన నుంచి ప్రజలు కొత్త పాలన ఆశిస్తున్నారని కూడా అన్నారు.
చదవండి:Groom covered: బట్టతల దాచి రెండో పెళ్లికి రెడీ..గుర్తుపట్టి చితక్కొట్టిన బంధువులు
కానీ పవన్ కళ్యాణ్ ఎంతసేపు నాకు పదవులు అవసరం లేదు. నేను ఇతరులకు సపోర్ట్ గా ఉంటానంటే ఇక ఆయన ఛాప్టర్ ముగిసినట్లే అని చెప్పారు. జనసేన పార్టీ పెట్టి ఇప్పటికీ 12 ఏళ్లు అవుతుంది. ఇప్పటికే ఎన్నో మంచి అవకాశాలు వదులుకున్నారన్నారు. చిరంజీవి (Chiranjeevi) పార్టీ పెట్టిన 9 నెలలకే కనీసం 18 సీట్లు అన్న గెలిచాడని, కానీ మీరు ఇప్పటి వరకు ఏం సాధించారు అని అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే కానీ ఓటమి తరువాత మళ్లీ మనం ఎలా బౌన్స్ బ్యాక్ అవుతున్నాము, ఎలా జనాల మన్ననలు పొందుతున్నాము అనేది చాలా కీలకమని వెల్లడించారు. మీదగ్గర ఉన్న సమాచారన్ని పోలీసులకు ఇవ్వండి వారు విచారణ చేపడుతారు. లేదా కోర్టుకు అన్న వెళ్లండి అన్ని అన్నారు. ఇక వాలంటరీ వ్యవస్థ చాలా ఉన్నతమైనది అని చెప్పారు.