మంత్రి పదవి దక్కిన తర్వాత… ఎమ్మెల్యే రోజా టీవీ షోలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆమె పూర్తి దృష్టి రాజకీయాలపై మాత్రమే పెట్టారు. కాగా… ఇటీవల ఆమె… ఓ టీవీ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా… అందులో షాకింగ్ విషయాలను వెల్లడించారు. తనకు భవిష్యత్తులో కూడా పార్టీ మారనని చెప్పారు. ఒకవేళ పార్టీ మారే పరిస్థితులు ఏర్పడితే… ఏకంగా.. రాజకీయాలకు దూరమౌపోతానని ఆమె స్పష్టం చేశారు.
ఇక… ఇటీవల ఆమె మీరా సాహెబ్ పాలెం అనే గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా… మహేష్… శ్రీమంతుడు సినిమా చూసి స్ఫూర్తి పొందానని.. అందుకే ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నానని చెప్పడం గమనార్హం. తాను గ్రామం దత్తత తీసుకున్న తర్వాత… ఆ గ్రామానికి చెందిన ఏడో తరగతి చదువుతున్న ముస్లిం అమ్మాయి తహసీన్ తనకు ఓ లేఖ రాసిందన్నారు.
ఆ లెటర్ పట్టుకుని నేరుగా ఆ ఊరికి వెళ్లానని.. అక్కడ రోడ్లు, డ్రైనేజీ లేవని.. రోడ్డు పక్కన చెత్త పేరుకుపోయి ఉందన్నారు. నగరి హెడ్ క్వార్టర్లో ఒక ముఖ్యమైన గ్రామం ఇలా ఉండటం ఆశ్చర్యం కలిగించిందన్నారు. 30, 40 ఏళ్లు పరిపాలించామని చెప్పుకునే పెద్ద నాయకులు ఉన్న ఊరిలో పరిస్థితి ఇలా ఉందా అనిపించిందన్నారు.
ఆ ఊరిలో పరిస్థితిని బాలిక తనతో చెప్పిందన్నారు. ఆ లెటర్లో ఉన్నది చదివాను.. నేరుగా ఊరిలో పరిస్థితిని చూశానన్నారు. ఆ రోజు ఆ అమ్మాయికి మాట ఇచ్చి.. లెటర్‌పై డేట్‌తో సహా వేసి సంతకం చేశానన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్కటిగా ఆ ఊరికి పనులు చేసుకుంటూ వస్తున్నట్లు చెప్పారు.