Minister Ambati Rambabu Write Letter To Pawan Kalyan
Minister Ambati Rambabu:జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు (pawan kalyan) మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu) బహిరంగ లేఖ రాశారు. పొత్తుల గురించి పవన్ కల్యాణ్ కామెంట్ చేయగా మంత్రి అంబటి స్పందించారు. పవన్ పని చంద్రబాబు నాయుడిని (chandrababu) కాపాడుకోవడమేనని పేర్కొన్నారు. అందుకోసమే బీజేపీతో కూడా కలిశాడని వివరించారు.
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు అనేది పవన్ కల్యాణ్ (pawan) రాజకీయ ఎత్తుగడ అని మంత్రి అంబటి విమర్శించారు. చంద్రబాబు (chandrababu) ఆడించినట్టు పవన్ ఆడతారని.. ఆయనకు సొంత ఎజెండా అంటూ ఏమీ లేదని చెప్పారు. ఇప్పుడు మీడియా ముందుకు కూడా చంద్రబాబు (chandrababu) స్క్రిప్ట్ ప్రకారం వస్తున్నారని తెలిపారు.
2014 ఎన్నికల్లో పోటీ వద్దని చంద్రబాబు (chandrababu) చెబితే బరిలోకి దిగలేదని అంబటి రాంబాబు (ambati rambabu) గుర్తుచేశారు. 2019లో అప్పటి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు లెఫ్ట్ పార్టీలతో కలిసి పనిచేశాడని వివరించారు. ఇప్పుడు ప్రతిపక్షాల కూటమి అని కొత్త డ్రామాకు తెరతీశారు. చంద్రబాబుతో రాజకీయ బంధం కోసం రైతుల పేరుతో పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారని అంబటి (ambati) ఆరోపించారు.
ఏపీలో అప్పుడే ఎన్నికల హీట్ నెలకొంది. పవన్ కల్యాణ్ (pawan kalyan) లక్ష్యంగా సీఎం జగన్ కామెంట్స్ చేయగా.. జనసేనాని కూడా అదే రేంజ్లో స్పందిస్తున్నారు. కలిసి పోటీ చేస్తాం అని చెబుతున్నారు. పవన్ వైఖరిని మంత్రి అంబటి రాంబాబు తప్పుపట్టారు.