మరోసారి తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ నటుడు, నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) ప్రకటించారు. రాజకీయాల్లోకి వస్తానని చెబుతూనే ఆయన బానిసత్వం గురించి వరుస ట్వీట్లు(Tweets) చేశారు. తన ట్వీట్లలో ఎక్కడా కూడా ఒక పార్టీని ఉద్దేశించి గానీ, వ్యక్తుల గురించి కానీ బండ్ల గణేష్ ప్రస్తావించలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పొత్తుల గురించి మాట్లాడారు. ఆ విషయంలో పవన్ క్లారిటీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే బండ్ల గణేష్(Bandla Ganesh) వరుస ట్వీట్లు చేయడం చర్చనీయాంశమైంది.
తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని బండ్ల గణేష్(Bandla Ganesh) ట్వీట్ చేశాడు. అలాగే తాను నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా, ధైర్యంగా, పౌరుషంగా, పొగరుగా రాజకీయాలు చేస్తాంటూ తెలిపారు. అంతేకాకుండా బానిసత్వానికి బైబై చెబుతూనే నిజాయితీతో కూడిన రాజకీయాలకు జైజై అంటూ చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్(Tweets Viral) అవుతున్నాయి.
బానిసత్వానికి భాయ్ భాయ్ నిజాయితీతో కూడిన రాజకీయాలకి జై జై 🔥🔥🔥🔥🔥
రాజకీయాలంటే నిజాయితీ రాజకీయాలంటే నీతి రాజకీయాలంటే కష్టం రాజకీయాలంటే పౌరుషం రాజకీయాలంటే శ్రమ రాజకీయాలంటే పోరాటం ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి రావాలి అందుకే వస్తా🔥🔥🔥🔥🔥
ఆఖరిసారిగా రాజకీయాలకు గురించి మరో ట్వీట్ చేశారు. రాజకీయాలంటే నిజాయితీ, రాజకీయాలంటే నీతి, రాజకీయాలంటే కష్టం, రాజకీయాలంటే పౌరుషం, రాజకీయాలంటే శ్రమ, రాజకీయాలంటే పోరాటం, ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి. రావాలి. అందుకే వస్తానంటూ బండ్ల గణేష్(Bandla Ganesh) ట్వీట్స్ చేశారు. గతంలో తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చిన బండ్ల గణేష్ సెవన్ ఓ క్లాక్ బ్లేడ్ డైలాగ్‌తో విపరీతంగా వైరల్ అయ్యారు. కాంగ్రెస్ ఓడిపోవడంతో పాలిటిక్స్‌లోకి రానంటూ చెప్పగా ఇప్పుడూ యూటర్న్ తీసుకున్నారు.