ADB: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశామని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రవీంద్రనగర్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రైస్తవ సోదరులంతా పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.