»Hunger Strike To Stop The Movie Tiger Nageswara Rao
Tiger Nageswara Rao : ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా ఆపేయాలని నిరసన దీక్ష!
రవితేజ మూవీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావుపై కేసు నమోదైంది. అంతేకాకుండా స్టువర్టుపురం ప్రజలు, ఎరుకల జాతి ప్రజలు వెంటనే సినిమాను ఆపేయాలని విజయవాడలో నిరాహార దీక్ష చేపట్టారు.
టాలీవుడ్ (Tollywood) హీరో, మాస్ మహారాజ రవితేజ (Raviteja) నటిస్తున్న తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao). పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ విడుదల కానుంది. ఒకప్పుడు స్టువర్టుపురం (Stuvartpuram) గజదొంగగా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. ఈ మూవీలో రా అండ్ రస్టిక్‌గా రవితేజ కనిపించనున్నాడు. ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడు వంశీ (Director Vamsi) చిత్రపరిశ్రమకు పరిచయం అవుతున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్ విడుదలై బాగా వైరల్ (Teaser Viral) అయ్యాయి. అవి సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. అయితే మొదట్నుంచీ ఈ మూవీకి వరుస ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ మూవీపై ఇప్పటికే స్టువర్టుపురం (Stuvartpuram) ప్రజలు, ఇంకొంతమంది కేసు వేశారు. ఈ నేపథ్యంలో కోర్టు కూడా మూవీ టీమ్‌ని హెచ్చరించింది.
తాజాగా మరోసారి టైగర్ నాగేశ్వరరావు సినిమా (Tiger Nageswara Rao) వివాదంలో నిలిచింది. ఎరుకల జాతిని, తమ గ్రామాన్ని కించపరిచేలా సినిమా తీస్తున్నారని స్టువర్టుపురం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎరుకల జాతికి చెందిన టైగర్ నాగేశ్వర రావుని గజదొంగలాగా ఇందులో చూపించి తమ గ్రామాన్ని నేర రాజధానిలా చూపెడుతున్నారని, వెంటనే ఈ సినిమాను ఆపాలని ఆ గ్రామస్తులు నిరసన దీక్ష చేపట్టారు.
స్టువర్టుపురం (Stuvartpuram) గ్రామస్తులు, ఎరుక జాతికి చెందిన వాళ్లు అందరూ కలిసి విజయవాడలో నిరసన దీక్ష చేపట్టడంతో మరోసారి ఈ మూవీ వార్తల్లో నిలిచింది. ఈ మూవీ తీసేముందు దర్శక నిర్మాతలు ఎవ్వరూ కూడా స్టువర్టుపురం ప్రజలను సంప్రదించలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై టైగర్ నాగేశ్వర రావు చిత్ర యూనిట్ ఇంత వరకూ స్పందించలేదు.