కర్నూల్ జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే (Kodumuru MLA) డా.సుధాకర్‌కు చేదు అనుభవం ఎదురైంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు సి.బెళగల్ మండలం పల్దొడ్డి గ్రామానికి ఎమ్మెల్యే వచ్చారు.గ్రామంలో అడుగుపెట్టగానే గ్రామస్థులు, విద్యార్థులు పెద్దఎత్తున చుట్టుముట్టారు. ఎమ్మెల్యే(MLA)పై సమస్యల వర్షం కురిపించారు. దీంతో.. ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే.. ఎక్కడా బ్యాలెన్సు (Balance) తప్పకుండా.. గ్రామస్థులు చెబుతున్న సమస్యల్ని మౌనంగా విన్నారు .తమ గ్రామన్నికి ఏం చేశారన్న నిలదీతతోపాటు రోడ్లు బాగోలేదన్న విషయాన్ని పలువురు ప్రస్తావించారు.రోడ్ల (Roads)పై గుంతలతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయన్న వారు.. నిత్యం వందల సంఖ్యలో పరిమితికి మించి ఇసుక లారీలు తిరుగుతుండటంతో రోడ్డు ధ్వంసమైందన్నారు.
అధికారులు బస్సులు (Buses) వేయటం లేదని.. చివరకు 108 వాహనం కూడా రావట్లేదన్న ఆవేదనను వ్యక్తం చేశారు. సమస్యల్ని పెద్ద ఎత్తున చెబుతున్న వేళ.. వారు చెప్పేదంతా మౌనంగా విన్నారు. ఈ క్రమంలో ఆయన్ను తిరిగి వెళ్లకుండా ఉండేందుకు ఆయన వాహనాలకు ఎడ్లబండ్లను.. రాళ్లను పెట్టేశారు. దీంతో.. పోలీసులు(Police)కలుగజేసుకొని ఆయన్ను తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. చివరికి పోలీసుల సాయంతో ఎమ్మెల్యే తిరిగి వెళ్లారు. వెళ్తూ వెళ్తూ.. ‘రహదారి బాగు చేసిన తర్వాతే గ్రామానికి వస్తా’ అని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.. దీంతో గ్రామస్థులు శాంతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను గ్రామస్తులు (Villagers) తనతో చెప్పిన అన్నీ సమస్యల్ని పరిష్కారిస్తానని చెప్పారు. రోడ్డు బాగు చేసిన తర్వాతే మళ్లీ ఊరికి వస్తానని చెప్పిన ఎమ్మెల్యే మాటకు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.