నందమూరి తారకరత్న మొత్తానికి మృత్యుంజయుడయ్యాడు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నాడని డాక్టర్లు తెలిపారు. అయినా ఇంకా ఆయనకు పూర్తి స్థాయిలో తగ్గకపోవడంతో ట్రీట్ మెంట్ చేస్తున్నారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తీసుకొచ్చే వరకు తారకరత్న కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. బెంగళూరు ఆసుపత్రిలో చేర్చిన రెండు రోజుల తర్వాత తారకరత్న కోలుకున్నాడు. ఇప్పుడు ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిసి నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
తారకరత్న గుండెపోటుతో కుప్పకూలగానే వెంటనే కుప్పంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడే రాత్రి వరకు ఉంచి ట్రీట్ మెంట్ చేశారు. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన ఆరోగ్యం కోలుకోవడానికి, ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యుల బృందం తారకరత్నకు ట్రీట్ మెంట్ చేయడానికి సహకరించింది.. ఇప్పుడు తారకరత్న బతికి ఉన్నాడంటే దానికి కారణం ముఖ్యంగా ఒక వ్యక్తి అని చెప్పుకోవాలి. నిజానికి బాలకృష్ణ, చంద్రబాబు కూడా వాళ్లకు తోచిన సాయం చేశారు. కానీ.. తెర వెనుక ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు. ఆయనే తారకరత్నకు కావాల్సిన వైద్య సదుపాయాన్ని చిటికెలో చేయించారు. ఆయనే కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కేశవ సుధాకర్.
కుప్పం నుంచి బెంగళూరుకు గ్రీన్ చానెల్ ఏర్పాటు చేయడంతో పాటు.. అధికారిక కార్యక్రమాలను కూడా రద్దు చేసుకొని రెండు మూడు రోజుల నుంచి ఆసుపత్రి చుట్టే తిరుగుతున్నారు ఆయన. కుప్పం నుంచి తారకరత్నను బెంగళూరుకు తరలించడం దగ్గర్నుంచి ఇప్పటి వరకు తారకరత్నకు కావాల్సినవన్నీ సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి తారకరత్నకు మంచి వైద్యం అందేలా చేశారు ఆయన. జూనియర్ ఎన్టీఆర్ కు ఆయన ఆప్త మిత్రులు. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. అందుకే జూనియర్ ఎన్టీఆర్ రిక్వెస్ట్ తో మంత్రి.. ఆసుపత్రిలోనే ఉండి తారకరత్నకు అన్ని రకాల వైద్య సదుపాయలను సమకూర్చారు. తారకరత్న కోలుకున్నాడంటే దానికి కారణం ఆరోగ్య శాఖ మంత్రే అని తెలుసుకొని నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. నందమూరి అభిమానులు కూడా ఆయన్ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
ಬೆಂಗಳೂರಿನ ನಾರಾಯಣ ಹೃದಯಾಲಯಕ್ಕೆ ತೆಲುಗು ಚಿತ್ರರಂಗದ ಖ್ಯಾತ ನಟರಾದ ಶ್ರೀ @tarak9999 ಅವರೊಂದಿಗೆ ಭೇಟಿ ನೀಡಿ ಅವರ ಸಹೋದರ ಸಂಬಂಧಿ ಖ್ಯಾತ ನಟರಾದ ಶ್ರೀ ನಂದಮೂರಿ ತಾರಕ ರತ್ನ ಅವರ ಆರೋಗ್ಯದ ಸ್ಥಿತಿಯ ಬಗ್ಗೆ ವೈದ್ಯರಿಂದ ಮಾಹಿತಿ ಪಡೆಯಲಾಯಿತು.