తిరుపతి జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వడమల చెక్‌పోస్టు వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో ఓ లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. రోడ్డుకు అడ్డంగా పడిన లారీని అదే దారిలో వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు మృతి చెందారు. మరోవైపు రోడ్డుపై వెళ్తున్న కారును చిత్తూరు నుంచి బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ఢీకొని మృతి చెందారు.