»Gollagudem Sarpanch Distributes Fish At Free Of Cost For His Villagers
Dwaraka Tirumala : ఆ సర్పంచ్ చాలా మంచోడు.. ఊరందరికీ చేపలు పంచాడు
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం గొల్లగూడెంలో వరుసగా రెండో ఏడాది ఆ ఊరి సర్పంచ్ చేపలను పంపిణీ చేశాడు. ఈ చేపలను పంచాయతీ చెరువులో పెంచారు. వాటిని సర్పంచ్ నాగభూషణం ఊరిలోని అందరికి ఉచితంగా పంపిణీ చేశారు.
Dwaraka Tirumala : చేపల కూరం(Fish Curry)టే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చేపల పులుసు అనగానే ప్రతి ఒక్కరి నోట్లో(Mouth) లాలాజలం ఊరుతూనే ఉంటుంది. నాణ్యమైన చేపలు దొరుకుతాయి అంటే ఎంత దూరమైనా వెళ్తాం. అలాంటి చేపలను ఓ ఊరిసర్పంచ్(Sarpanch) తన ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేశాడు. పైగా ఆదివారం(Sunday) కావడంతో ఆ ఊరు(Village) మొత్తం చేపల కూర వాసనే. గతేడాది కూడా ఇలానే చేపల్ని పంపిణీ చేశాడు. అంతేకాదు ఈ చేపలను సహజసిద్ధంగా పెంచారు.. దీంతో జనాలు చేపలతో పండుగ చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఏలూరు(Eluru) జిల్లా ద్వారకాతిరుమల మండలం గొల్లగూడెం(gollagudem)లో వరుసగా రెండో ఏడాది ఆ ఊరి సర్పంచ్ చేపలను పంపిణీ చేశాడు. ఈ చేపలను పంచాయతీ చెరువులో పెంచారు. వాటిని సర్పంచ్ నాగభూషణం(Nagabhushanam) ఊరిలోని అందరికి ఉచితంగా పంపిణీ చేశారు. గొల్లగూడెం పంచాయతీ చెరువును లీజుకిస్తే చేపల పెంపకానికి వినియోగించే వ్యర్థాలు, ఇతర పదార్థాలతో చెరువు కలుషితమయ్యేది. దీంతో సర్పంచ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చెరువును బహిరంగ వేలంలో లీజుకు సంబంధించిన డబ్బుల్ని పంచాయతీ(Panchayat)కి చెల్లించి గ్రామం కిందే తీసుకున్నారు. ఈ చేపల్ని కూడా సహజ సిద్దమైన ఆహారంతో పెంచారు. గ్రామంలో అందరి ఇంటి పన్ను మొత్తాన్ని సర్పంచ్‌కి చెల్లించారు.. ఆ రశీదులతో పాటూ చేపల్ని పంపిణీ చేశారు. ఈ చెరువులో శీలావతి, కట్ల, రూప్‌చంద్, గడ్డిచేపలు, బొచ్చల వంటి చేపలు ఉన్నాయి. చేపలను ఉచితంగా పంపిణి చేసిన సర్పంచ్‌కు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.