ELR: డిసెంబర్ 31న జిల్లాలో సామాజిక పెన్షన్ల పంపిణీ జరుగుతుందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు జిల్లాలో 2,62,228 మంది పెన్షన్దారులకు రూ.113.01 కోట్లు పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు. పెన్షన్ పంపిణీపై అధికారులతో శనివారం సమీక్షించారు. పెన్షన్ చెల్లింపులు జనవరి 1న ఆంగ్ల సంవత్సరాది కావడంతో ఒకరోజు ముందే పంపిణీ చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.