SKLM: లక్ష్మీ నర్సు పేట గ్రామంలోని చిన్న ఒరియా బ్రాహ్మణ వీధిలో శనివారం మహమ్మహి అమ్మవారి ఉజ్జపాన ఉత్సవం వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో మంగళ వాయిద్యాలతో వంశధార నదీ జలాల కలిశాల, పసుపు కుంకుమలతో మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ పురవీధుల్లో ఊరేగింపు చేపట్టారు. మహిళలు భక్తి శ్రద్ధలతో సంవత్సరం పాటు ప్రతీ శనివారం పూజలు చేశారు.