చిత్తూరు జిల్లాలో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్(HPV) వాక్సికేషన్ కార్యక్రమం సోమవారం నాటికి 1,901 మంది బాలికలకు వాక్సిన్ వేసినట్లు అధికారులు తెలిపారు. క్యాన్సర్ మహమ్మారిని కట్టడి చేయడానికి ఈ టీకా కార్యక్రమాన్ని ఈనెల 10వ తేదీన ప్రారంభించారు. జిల్లాలో 10,999 మంది బాలికలు అర్హులుగా గుర్తించగా, వారి కోసం మొదటి దశలో 6,045 సింగిల్ డోస్ వైల్స్ వచ్చాయి.