అన్నమయ్య: కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేరింది. ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసుల కథనం..తంబళ్లపల్లికి చెందిన లావణ్య(28) కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది వాస్మోల్ తాగింది. కుటుంబీకులు బాధితురాలిని మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వైద్యులు తిరుపతి రుయాకు రెఫర్ చేశారు.