SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావును ఆయన క్యాంప్ కార్యాలయంలో విజయనగరం ఎంపీ అప్పలనాయుడు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎచ్చెర్ల నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కొరత, భవిష్యత్ ప్రాజెక్టులపై చర్చించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో NDA కూటమి పార్టీల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇరువురు నిర్ణయించారు.