CTR: ప్రతి కుటుంబంలో ఒక మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని నారా భువనేశ్వరి ఆకాంక్షించారు. కుప్పం పర్యటనలో భాగంగా ద్రవిడ వర్సిటీలో అలీఫ్ మహిళా పారిశ్రామికవేత్తల సమావేశంలో బుధవారం పాల్గొన్నారు. మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె వివరించారు.