సత్యసాయి: జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఇంజనీరింగ్ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆర్ అండ్ బీ, హెచ్ఎల్సీ, హెచ్ఎన్ఎస్ఎస్ వంటి విభాగాల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. జూలై నెలాఖరులోగా హెచ్ఎన్ఎస్ఎస్ పనులు పూర్తి కావాలని స్పష్టం చేశారు.