ప్రకాశం: కనిగిరి పట్టణంలోని వినాయక మండపాల వద్ద నిమజ్జనం అయ్యే వరకు ప్రతి రోజు ఉదయం శానిటేషన్ చేయించి సున్నమ్, బ్లీచింగ్ వేయించాలని సానిటరి సెక్రటరీలకు మునిసిపల్ కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలోని పలు వినాయక విగ్రహాల వద్ద మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు శుభ్రం చేశారు. ప్రతి మండపం వద్ద డ్రమ్ములు ఏర్పాటు చేయాలని సూచించారు.